పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కల్పాంత వర్ణన

  •  
  •  
  •  

8-714-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నెఱి నెల్లప్పుడు నిల్చి ప్రాణిచయమున్ నిర్మించి నిర్మించి వీఁ
పియన్ నీల్గుచు నావులించుచు నజుం డే సృష్టియున్ మాని మే
నొఱఁగన్ ఱెప్పలు మూసి కేల్ దలగడై యుండంగ నిద్రించుచున్
గుఱు పెట్టం దొడఁగెం గలల్ గనుచు నిర్ఘోషించుచున్ భూవరా!

టీకా:

నెఱిన్ = పూర్తిగా; ఎల్లప్పుడు = ఎడతెగకుండ; నిల్చి = పూని; ప్రాణి = జీవ; చయమున్ = జాలమును; నిర్మించినిర్మించి = సృష్టిచేసిచేసి; వీపు = వీపు; ఇఱయన్ = నలిగిపోగా; నీల్గుచున్ = ఒళ్ళువిరుచుకొంటు; ఆవులించుచున్ = ఆవలిస్తూ; ఉండెన్ = ఉండెను; అజుండు = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మములేనివాడు, బ్రహ్మ}; ఏ = ఎలాంటి; సృష్టియున్ = సృష్టికూడ; మాని = చేయకుండ; మేను = దేహము; ఒఱగన్ = వాలిపోగా; ఱెప్పలు = కనురెప్పలు; మూసి = మూసికొని; కేల్ = చెయ్యి; తలగడ = తలదిండు; ఐ = అయ్యి; ఉండంగన్ = ఉండగా; నిద్రించుచున్ = నిద్రపోతూ; గుఱు = గురకలు; పెట్టన్ = పెట్టుట; తొడగెన్ = మొదలిడెను; కలల్ = కలలు; కనుచున్ = కంటూ; నిర్ఘోషించుచున్ = గట్టిగా చప్పుడు చేస్తూ; భూవరా = రాజా.

భావము:

రాజ్యాన్ని ఏలే రాజా పరీక్షిత్తూ! అవిశ్రాంతంగా కూర్చుని ఓర్పుతో ప్రాణులను సృష్టించి జన్మించుట లేని వాడు అగు బ్రహ్మదేవుడు అలసిపోయాడు. వీపు నడుము నొచ్చసాగాయి. అతడు ఒళ్ళువిరుచుకుంటూ, ఆవులిస్తూ సృష్టికార్యాన్ని ఆపాడు. నడుం వాల్చి, కళ్ళు మూసికొని, చెయ్యి తలగడగా పెట్టుకున్నాడు. గురకలు పెడుతూ కలలు కంటూ ఒళ్ళుతెలియని నిద్రపోయాడు.