పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కల్పాంత వర్ణన

  •  
  •  
  •  

8-712-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మున్ను పోయిన కల్పాంతమున నరేంద్ర!
బ్రహ్మ మనఁగ నైమిత్తిక ప్రళయ వేళ
నింగిపై నిట్టతొలఁకు మున్నీటిలోనఁ
గూలె భూతాళి జగముల కొలఁదు లెడలి.

టీకా:

మున్ను = ఇంతకుముందు; పోయిన = గడచిపోయినట్టి; కల్ప = కల్పము; అంతమునన్ = చివర; నరేంద్ర = రాజా; బ్రహ్మము = బ్రహ్మప్రళయము; అనగన్ = అనబడెడి; నైమిత్తికప్రళయ = నైమిత్తికప్రళయపు; వేళన్ = సమయమునందు; నింగి = ఆకాశము; పైన్ = మీదకు; నిట్టన్ = నిక్కెడి, ఎగసెడి; తొలకు = అలలుకలిగిన; మున్నీటి = సముద్రము; లోనన్ = లో; కూలెన్ = కూలిపోయినవి; భూత = జీవ; అళి = రాశులన్ని; జగముల = లోకముల; కొలదులు = సరిహద్దులు; ఎడలి = చెరిగిపోయి.

భావము:

పరీక్షిత్తు మహారాజా! గడచిపోయిన కల్పం అంతం కాగా, బ్రహ్మప్రళయం అనే నైమిత్తిక ప్రళయం ఏర్పడింది. సముద్రాలు చెలియలి కట్టలు దాటాయి. నిట్టనిలువుగా ఆకాశమంత లేచిన అలల సముద్రంలో లోకాల సరిహద్దులు చెరిగిపోయాయి. ప్రాణులు సమస్తం కూలిపోయాయి.