పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మీనావతారుని ఆనతి

  •  
  •  
  •  

8-708-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్స్యరూపి యైన మాధవు నుడుగులుఁ
లఁచికొనుచు రాచపసి యొక్క
ర్భశయ్యఁ దూర్పుఁ లగడగాఁ బండి
కాచి యుండె నాఁటి కాలమునకు.

టీకా:

మత్స్యరూపి = చేపస్వరూపము కలవాడు; ఐన = అయిన; మాధవున్ = విష్ణుని; నుడుగులు = మాటలు; తలచికొనుచున్ = తలచుకొంటూ; రాచతపసి = రాజర్షి; ఒక్క = ఒక; దర్భశయ్యన్ = దర్భలశయ్యపైన; తూర్పున్ = తూర్పువైపునకు; తలగడ = దిండు; కాన్ = ఉండునట్లు; పండి = పడుకొని; కాచి = వేచి, ఎదురుచూచుచు; ఉండెన్ = ఉండెను; నాటి = అప్పటి; కాలమున్ = సమయము; కున్ = కోసము.

భావము:

అలా శ్రీ మహా విష్ణువు చేప రూపంతో చెప్పిన విషయాలను తలచుకుంటూ, తపశ్శాలి అయిన సత్యవ్రత మహారాజు తూర్పువైపుగా తలగడ పెట్టుకుని దర్బల శయ్యమీద పరుండి మీన రూపుడు చెప్పిన ప్రళయ సమయం కోసం వేచి ఉన్నాడు.