పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మీనావతారుని ఆనతి

 •  
 •  
 •  

8-706-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"టమీఁద నీ రాత్రికేడవదినమునఁ;
ద్మగర్భున కొక్క గలు నిండు;
భూర్భువాదిక జగంబులు మూఁడు విలయాబ్ధి;
లోన మునుంగు; నాలోనఁ బెద్ద
నావ చేరఁగ వచ్చు; నా పంపు పెంపున;
దానిపై నోషధితులు బీజ
రాసులు నిడి పయోరాశిలో విహరింపఁ;
లవు సప్తర్షులుఁ లసి తిరుఁగ

8-706.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మ్రోలఁ గాన రాక ముంచు పెంజీఁకటి
మిడుకుచుండు మునుల మేనివెలుఁగుఁ
దొలకుచుండు జలధి దోధూయమాన మై
నావ దేలుచుండు రవరేణ్య!

టీకా:

ఇటమీద = ఇకపైన; రాత్రి = రాత్రి; కిన్ = గడచినతరువాతి; దినమున = రోజు; పద్మగర్భున్ = బ్రహ్మదేవున; కున్ = కు; ఒక్క = ఒక; పగలు = దినభాగము; నిండున్ = పూర్తగును; భూర్భువాదికజగంబులు = ముల్లోకములు; మూడున్ = మూడు; విలయ = ప్రళయము యనెడి; అబ్దిన్ = సముద్రము; లోనన్ = అందు; మునుంగును = మునిగిపోవును; ఆలోనన్ = అప్పుడు; పెద్ద = పెద్దదైన; నావ = నావ; చేరగ = దగ్గరగా; వచ్చున్ = వచ్చును; నా = నా యొక్క; పంపుపెంపునన్ = ఆజ్ఞానుసారమున; దాని = దాని; పైన్ = మీద; ఓషధి = మొక్కల {ఓషధి - ఫలించగనేనశించు వృక్షజాతులు}; తతులున్ = సమూహములు; బీజ = విత్తనముల; రాసులున్ = సమూహములు; ఇడి = ఉంచి; పయోరాశిన్ = సముద్రము {పయోరాశి - పయస్ (నీటి) రాశి, కడలి}; లోన్ = అందు; విహరింపగలవు = సంచరింపుము; సప్తర్షులున్ = సప్తఋషుల; కలసి = తోకూడ; తిరుగన్ = చరించుచుండగా.
మ్రోలన్ = ఎదురుగా ఉన్నదికూడ; కానరాక = కనబడకుండనంతగా; ముంచు = ముంచుకొచ్చిన; పెంజీకటి = పెద్దచీకటి, కటికచీకటి; మిడుకుచున్ = ఆవరించి; ఉండున్ = ఉండును; మునుల = ఋషుల; మేని = దేహ; వెలుగున్ = కాంతి; తొలకుచున్ = మిణుకుమిణుకుమనుచు; ఉండున్ = ఉండును; జలధిన్ = సముద్రమునందు {జలధి - జలమునకునిధి, కడలి}; దోదూయమానము = ఊగుతూతూగుతూఉన్నది; ఐ = అయ్యి; నావ = పెద్దపడవ; తేలుచున్ = తేలుతూ; ఉండున్ = ఉండును; నరవరేణ్య = రాజా {నరవరేణ్యుడు - నరులలోవరేణ్యుడు, రాజు}.

భావము:

“ఓ రాజా! ఈ రాత్రి గడచిన పిమ్మట రాబోయే ఏడవ నాటితో బ్రహ్మదేవుడికి ఒక పగలు పూర్తి అవుతోంది. భూలోకం మొదలు మూడులోకాలూ ప్రళయసముద్రంలో మునుగుతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఓషధులు, విత్తనాల రాసులూ ఆ నౌకపై పెట్టుకుని ప్రళయసముద్రంలో విహరించు. సప్తఋషులు నీతో కలిసి ఆ ఓడలో ఉంటారు. మీ ముందు అంతా పెనుచీకటి ఆవరిస్తుంది. మునుల మేని కాంతులు మిణుకు మిణుకు అంటూ మెరుస్తుంటాయి. సముద్రంలో నావ ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది.