పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మత్స్యావతార కథా ప్రారంభం

  •  
  •  
  •  

8-704-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీలనాకుచవేదికఁ
గేళీపరతంత్రబుద్ధిఁ గ్రీడించు సుఖా
లోలుఁడవు దామసాకృతి
నేలా మత్స్యంబ వైతి వెఱిఁగింపు హరీ!"

టీకా:

శ్రీలలనా = లక్ష్మీదేవియొక్క; కుచ = స్తనములనెడి; వేదికన్ = వేదికలపైన; కేళీ = క్రీడించుటయందు; పరతంత్ర = మునుగెడి; బుద్ధిన్ = ఉద్దేశ్యముతో; క్రీడించు = విహరించెడి; సుఖ = సౌఖ్యములందు; ఆలోలుడవు = ఆనందస్వరూపుడవు; తామస = జ్ఞానరహితమైన; ఆకృతిన్ = రూపముకలదానిని; ఏలా = ఎందుకు; మత్స్యంబవు = చేపవు; ఐతివి = అయినావు; ఎఱిగింపు = తెలుపుము; హరీ = నారాయణా.

భావము:

హరీ! లక్ష్మీదేవి వక్షస్థలంపై క్రీడిస్తూ సంతోషంగా విహరించే ఆనందస్వరూపుడవు. తామస ప్రకృతితో తిరిగే చేప రూపాన్ని ఎందుకు ధరించావో తెలుపుమయ్యా!”