పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మత్స్యావతార కథా ప్రారంభం

  •  
  •  
  •  

8-703-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రులముఁ గాము చిత్సం
తులము మా పాలి నీవుఁ లిగితి భక్త
స్థితుఁడవగు నిన్ను నెప్పుడు
తి చేసినవాని కేల నాశముఁ గలుగున్.

టీకా:

ఇతరులము = పరాయివారము; కాము = కాము; చిత్ = సద్బుద్ధి; సంగతులము = కలవారము; మా = మా; పాలిన్ = ఎడల, అండగా; నీవున్ = నీవు; కలిగితి = ఉన్నావు; భక్త = భక్తుల యెడ; స్థితుడవు = అనుకూలుడవు; అగు = అయిన; నిన్నున్ = నిన్ను; ఎప్పుడున్ = ఎప్పుడు; నతి = స్తోత్రము; చేసిన = చెసెడి; వాని = వాడి; కిన్ = కి; ఏలన్ = ఎలా; నాశము = చేటు; కలుగున్ = కలుగుతుంది.

భావము:

మేము నీకు పరాయివాళ్ళం కాదు. నిర్మల జ్ఞానం కలవాళ్ళము. మాకు అండగా నీవు ఉంటావు. భక్తులలో నివసించే వాడవు నీవు. నీకు నిత్యం నమస్కరించే వాడికి చేటు కలుగనే కలుగదు కదా.