పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మత్స్యావతార కథా ప్రారంభం

  •  
  •  
  •  

8-700-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఉం నిదిఁ గొంచె మెంతయు
నొండొకటిం దెమ్ము భూవరోత్తమ!" యనుడున్
గంకముఁ దెచ్చి విడిచెను
మంలపతి సలిల కలశ ధ్యమున నృపా!

టీకా:

ఉండన్ = ఉండుటకు; కొంచము = చిన్నది; ఎంతయున్ = ఎంతో; ఒండొకటిన్ = ఇంకొకదానిని; తెమ్ము = తీసురావలసినది; భూవర = రాజ; ఉత్తమ = శ్రేష్ఠుడా; అనుడును = అనగా; గండకమున్ = పెద్దదానిని; తెచ్చి = తీసుకొని వచ్చి; విడిచెను = వదలెను; మండలపతి = రాజు; సలిల = నీళ్ళ; కలశ = బాన; మధ్యమునన్ = లోపల; నృపా = రాజా.

భావము:

“ఓ రాజేంద్రా! ఈ కమండలం నేను ఉండటానికి సరిపోదు. ఇంకొక దానిని తీసుకురా” అని చేప పిల్ల అంది. సత్యవ్రతుడు దానిని పెద్ద నీళ్ళ గంగాళంలోకి మార్చాడు.