పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మత్స్యావతార కథా ప్రారంభం

  •  
  •  
  •  

8-693-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మునిజనంబులు సూతు నడిగిన నతం డిట్లనియె "మీర లడిగిన యీ యర్థంబుఁ బరీక్షిన్నరేంద్రుం డడిగిన భగవంతుం డగు బాదరా యణి యిట్లనియె.

టీకా:

అని = అని; ముని = మునులైన; జనంబులు = వారు; సూతున్ = సూతుని; అడిగినన్ = అడుగగా; అతండు = అతడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను; మీరలు = మీరు; అడిగిన = అడిగినట్టి; ఈ = ఈ; అర్థంబున్ = విషయమును; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = మహారాజు; అడిగినన్ = అడుగగా; భగవంతుండు = మహామహిమాన్వితుడు; అగు = అయిన; బాదరాయణి = శుకుడు {బాదరాయణి - బాదరాయణుని (వ్యాసుని) పుత్రుడు, శుకుడు}; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

అంటూ మీనావతారం కథ వివరించమని శౌనకాదులు అడిగారు. అంతట సూతమహర్షి వారితో ఇలా అన్నాడు “మీరు అడిగినట్లే పరీక్షిత్తు అడిగితే, భగవత్స్వరూపుడు అయిన శుకమహర్షి ఇలా చెప్పాడు.