పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మత్స్యావతార కథా ప్రారంభం

  •  
  •  
  •  

8-692-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"విమలాత్మ! విన మాకు వేడ్క యయ్యెడి; మున్ను-
రి మత్స్యమైన వృత్తాంతమెల్లఁ;
ర్మబద్ధుని భంగి నుఁ డీశ్వరుఁడు లోక-
నిందితంబై తమోనిలయమైన
మీనరూపము నేల మే లని ధరియించె?-
నెక్కడ వర్తించె? నేమి చేసె?
నాద్యమై వెలయు న య్యవతారమునకు నె-
య్యది కారణంబు? గార్యాంశ మెట్లు?

8-692.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీవు దగుదు మాకు నిఖిలంబు నెఱిఁగింపఁ
దెలియఁ జెప్పవలయు, దేవదేవు
రిత మఖిలలోక సౌభాగ్య కరణంబు
గాదె? విస్తరింపు క్రమముతోడ."

టీకా:

విమల = నిర్మలమైన; ఆత్మ = ఆత్మకలవాడా; వినన్ = వినుటకు; మా = మా; కున్ = కు; వేడ్కన్ = కుతూహలము; అయ్యెడిన్ = కలుగుచున్నది; మున్ను = పూర్వము; హరి = విష్ణుడు; మత్య్యము = మత్స్యావతారము; ఐన = ఎత్తిన; వృత్తాంతము = కథ; ఎల్లన్ = సమస్తమును; కర్మబద్దుని = భవబంధములుకలవాని; భంగిన్ = వలె; ఘనుడు = గొప్పవాడు; ఈశ్వరుడు = భగవంతుడు; లోక = లోకమున; నిందితంబున్ = అగౌరవమైనది; ఐ = అయ్యి; తమస్ = తమోగుణముతో; నిలయము = నిండినది; ఐన = అయిన; మీనరూపమున్ = మీనావతారమును; ఏలన్ = ఎందులకు; మేలు = మంచిది; అని = అని; ధరియించెన్ = స్వీకరించెను; ఎక్కడన్ = ఎక్కడ; వర్తించెన్ = ఉండెను; ఏమి = ఏమిటి; చేసెన్ = చేసెను; ఆద్యము = పురాతనమైనది; ఐ = అయ్యి; వెలయున్ = ప్రకాశించెడి; ఆ = ఆ; అవతారమున్ = అవతారమున; కున్ = కు; ఎయ్యది = ఏమిటి; కారణంబున్ = కారణము; కార్యాంశము = కార్యక్రమములు; ఎట్లు = ఏమిటి.
నీవు = నీవు; తగుదు = తగినవాడవు; మా = మా; కున్ = కు; నిఖిలంబున్ = సమస్తమును; ఎఱిగింపన్ = తెలుపుటకు; తెలియజెప్పవలయు = విశదముగాచెప్పుము; దేవదేవు = విష్ణుని; చరితము = కథ; అఖిల = సర్వ; లోక = లోకములకు; సౌభాగ్య = శుభములను; కరణంబు = కలిగించెడిది; కాదె = కాదా అవును; విస్తరింపు = వివరించుము; క్రమము = క్రమము; తోడన్ = ప్రకారముగ.

భావము:

“సూతమహర్షి! నీవు బహునిర్మల హృదయం కలవాడవు. పూర్వం విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు కదా, ఆ కథ అంతా వినాలని బాగా ఆసక్తిగా ఉంది. కర్మానికి కట్టుబడి ఉండే జీవుడు లోకంలో గౌరవమూ, జ్ఞానమూ లేని చేపగా పుడుతూ ఉండవచ్చు గానీ, భగవంతుడు అయిన విష్ణుమూర్తి ఎందుకు అలాంటి చేపరూపు ఏదో మంచిది అన్నట్లు ధరించాడు? అలా ధరించి ఎక్కడ ఉన్నాడు? ఏమి కార్యాలు సాధించాడు? అవతారాలలో మొదటి వరుసలోది అయిన ఆ మీనావతారం ఎత్తడానికి కారణం ఏమిటి? దాని అవసరం ఏమిటి? ఇవన్నీ వివరంగా తెలుపడానికి నివే సమర్థుడవు. దేవాధిదేవుడు విష్ణుమూర్తి కథలు సకల లోకాలకూ మేలు చేకూర్చేవి కదా, కనుక ఈ వృత్తాంత సవివరంగా విశదీకరించు.”