పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలియఙ్ఞమును విస్తరించుట

  •  
  •  
  •  

8-683-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లిదంపుదోడు ప్రాపున నింద్రుని
కింద్రపదము చేరు టిట్లు గలిగెఁ;
నకు నాఢ్యుఁడైన మ్ముఁడుఁ గలిగినఁ
గోర్కులన్న కేల కొఱఁత నొందు?

టీకా:

బల్లిదంపు = బలవంతుడైన; తోడు = తోడబుట్టువు; ప్రాపునన్ = దన్నువలన; ఇంద్రుని = ఇంద్రుని; కిన్ = కి; ఇంద్రపదవి = ఇంద్రత్వము; చేరుట = సమకూరుట; ఇట్లు = ఈ విధముగ; కలిగెన్ = కలిగినది; తన = తన; కున్ = కు; ఆఢ్యుడు = శ్రేష్ఠుడు; ఐన = అయినట్టి; తమ్ముడు = తమ్ముడు; కలిగినన్ = ఉన్నట్లయితే; కోర్కులు = కోరికలు; అన్న = అన్నయ్య; కిన్ = కి; ఏల = ఎందుకు; కొఱతన్ = నెరవేరకపోవుట; ఒందున్ = పొందును.

భావము:

ఈ విధంగా బలవంతుడైన తమ్ముడి ప్రాపువల్ల, ఇంద్రుడికి ఇంద్రపదవి తిరిగి లభించింది. శ్రేష్ఠుడైన తమ్ముడుంటే అన్నగారి కోరికలు నెరవేరకుండా ఉంటాయా.