పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలియఙ్ఞమును విస్తరించుట

  •  
  •  
  •  

8-680.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యింతకంటెను శుభము నా కెచటఁ గలుగు"
నుచు హరిపంపు శిరమున నావహించి
కావ్యుఁ డసురేంద్రు జన్నంబు డమఁ దీర్చె
మునులు విప్రులు సాహాయ్యమునఁ జరింప.

టీకా:

అఖిల = సమస్తమైన; కర్మంబుల్ = కర్మలకు; అధినాథుడవు = పైఅధికారివి; నీవ = నీవే; యజ్ఞేశుడవు = యజ్ఞపతివి; నీవ = నీవే; యజ్ఞపురుష = యజ్ఞస్వరూప; ప్రత్యక్షమునన్ = ఎదురుగా; నీవున్ = నీవే; పరితుష్టిన్ = సంతృప్తిని; ఒందినన్ = పొందగా; కడమ = కొరతలు; ఏలకల్గున్ = ఎలాకలుగును, కలుగదు; ఏ = ఏ; కర్మముల = కర్మకాండల; కున్ = కైనను; ధన = ధనము; దేశ = ప్రదేశము; కాల = సమయములకు; అర్హ = తగిన; తంత్ర = తంతులు; మంత్రంబులన్ = మంత్రములచేత; కొఱతలు = ప్రాప్తించినదోషములు; నిన్నున్ = నిన్ను; పేర్కొనినన్ = తలచినచో; మానున్ = తొలగిపోవును; అయినన్ = అయినప్పటికిని; కావింతున్ = నిర్వహించెదను; నీ = నీ యొక్క; ఆనతిన్ = ఆజ్ఞమేరకు; భవత్ = నీ యొక్క; అజ్ఞన్ = ఆనతిప్రకారము; మెలగుట = నడచుట; జనుల్ = మానవుల; కున్ = కు; మేలు = ఉత్తమము; కాదే = కదా.
ఇంత = దీని; కంటెను = కంటెను; శుభము = భాగ్యము; నా = నా; కున్ = కు; ఎచటన్ = ఎక్కడ; కలుగున్ = దొరకును; అనుచున్ = అనుచు; హరి = నారాయణుని; పంపు = ఆజ్ఞను; శిరముననావహించి = తలదాల్చి; కావ్యుడు = శుక్రుడు {కావ్యుడు - కవియొక్కపుత్రుడు, శుక్రుడు}; అసురేంద్రు = బలియొక్క; జన్నంబున్ = యాగమును; కడమదీర్చె = పూర్తిచేసెను; మునులు = ఋషులు; విప్రులు = బ్రాహ్మణులు; సాహాయ్యమునన్ = తోడ్పడుతూ; చరింప = మెలగగా.

భావము:

“నీవే అన్ని కార్యాలకూ అధినాదుడవు. నీవే యజ్ఞాలకు అధికారివి. నీవు సంతోషిస్తే ఏకార్యాలకూ లోపం కలుగదు. నిన్ను ధ్యానంచేస్తే ధనానికీ దేశానికి మంత్రతంత్రాలకూ ప్రాప్తించిన దోషాలు తొలగిపోతాయి. మంచిది. నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. నీ ఆజ్ఞకు లోబడి మెలగడము మానవులకు మేలు. ఇంతకంటే భాగ్యం ఏముంది.” ఇలా అనిన శుక్రుడు విష్ణువు ఆజ్ఞను తలదాల్చి బలిచక్రవర్తి యాగాన్ని పూర్తి చేసాడు. అతనికి బ్రాహ్మణులూ ఋషులూ తోడ్పడ్డారు.