పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : రాక్షసుల సుతల గమనంబు

  •  
  •  
  •  

8-667.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోకపాలకులకు లోనుగా వక్కడ
న్యు లెంతవార చట? నిన్ను
నెల్ల ప్రొద్దు వచ్చి యేను రక్షించెదఁ
రుణతోడ నీకుఁ గానవత్తు.

టీకా:

సేమంబు = మేలుకలుగును; నీ = నీ; కున్ = కు; ఇంద్రసేనమహారాజ = ఇంద్రసేనమహారాజ; వెఱవకు = బెదరిపోకు; మేలు = శ్రేష్ఠమైనది; నీ = నీ యొక్క; వితరణంబు = దాతృత్వము; వేలుపులు = దేవతలు; అందున్ = అక్కడ; ఉండన్ = ఉండుటకు; వేడుక = ఉత్సుకత; పడుదురు = పొందెదరు; దుఃఖంబులు = దుఃఖములు; ఇడుములు = కష్టములు; దుర్మరణము = దుర్మరణములు; ఆతురతలు = ఆతృతలు; నొప్పులు = బాధలు; అందున్ = అక్కడ; ఉండు = ఉండెడి; వారి = వారల; కిన్ = కు; ఒందవు = పొందవు; సుతలము = సుతలము; అందున్ = లో; ఉండు = ఉండుము; నీవు = నీవు; నీ = నీ యొక్క; పంపుజేయని = ఆజ్ఞనులెక్కచేయని; నిర్జరారాతులన్ = రాక్షసులను {నిర్జరారాతులు - నిర్జరుల (దేవతల) ఆరాతులు (శత్రువులు), రాక్షసులు}; నా = నా యొక్క; చక్రము = చక్రము; ఏతెంచి = వచ్చి; నఱుకుచుండున్ = సంహరించును.
లోకపాలకుల = ఏలోకపాలకుల; కున్ = కి; లోనుకావు = లొంగియుండవు; అక్కడ = అక్కడ; అన్యులు = ఇంక ఇతరులు; ఎంతవారలు = ఎంతటివారు; అచటన్ = అక్కడ; నిన్నున్ = నిన్ను; ఎల్ల = అన్ని; ప్రొద్దున్ = వేళలందు; వచ్చి = వచ్చి; ఏను = నేను; రక్షించెదన్ = కాపాడెదను; కరుణ = దయ; తోడన్ = తోటి; నీ = నీ; కున్ = కు; కానవత్తున్ = కనిపించుతుంటాను.

భావము:

“ఇంద్రసేనమహారాజా! నీకు మేలు కలుగుతుంది. భయపడవద్దు. నీ త్యాగం శ్రేష్ఠమైనది. సుతలలోకంలో ఉండడానికి దేవతలు సైతం కుతూహల పడతారు. అంత చక్కటి ఆ లోకంలోనివారికి దుఃఖమూ, కష్టమూ, దుర్మరణమూ, రోగబాధలూ, కీడు కలగవు. అటువంటి లోకంలో నీవు ఉండు. నీ ఆజ్ఞమీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది. ఆ లోకంలో దిక్పాలకులకు నీ మీద అధికారం ఉండదు. ఇంక ఇతరులను లెక్కించేది ఏముంది. ఎల్లప్పుడూ నేను నిన్ను రక్షిస్తుంటాను. కనికరంతో కనిపెట్టి ఉంటాను.