పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : హిరణ్యగ ర్భాగమనము

  •  
  •  
  •  

8-659-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూతలోకేశ్వర! భూతభావన! దేవ-
దేవ! జగన్నాథ! దేవవంద్య!
న సొమ్ము సకలంబుఁ ప్పక నీ కిచ్చె-
దండయోగ్యుఁడు గాడు దానపరుఁడుఁ;
రుణింప నర్హుండు మలలోచన! నీకు-
విడిపింపు మీతని వెఱపు దీర;
తోయపూరము చల్లి దూర్వాంకురంబులఁ-
జేరి నీ పదము లర్చించునట్టి

8-659.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్తియుక్తుఁడు లోకేశుదము నందు
నీవు ప్రత్యక్షముగ వచ్చి నేఁడు వేఁడ
నెఱిఁగి తన రాజ్య మంతయు నిచ్చి నట్టి
లికిఁ దగునయ్య! దృఢపాశబంధనంబు?"

టీకా:

భూతలోకేశ్వరా = నారాయణ {భూతలోకేశ్వరుడు - భూతలోక (సమస్తమైన ప్రాణులకు) ఈశ్వరుడు, విష్ణువు}; భూతభావన = నారాయణ {భూతభావన - సమస్తప్రాణులచేత ధ్యానించబడువాడు, విష్ణువు}; దేవదేవ = నారాయణ {దేవదేవ - మహాగొప్పదేవుడు, విష్ణువు}; జగన్నాథ = నారాయణ {జగన్నాథ - సర్వ లోకాధిపతి, విష్ణువు}; దేవవంద్య = నారాయణ {దేవవంద్యుడు - దేవతలచే వంద్యుడు (స్తుతింపబడువాడు), విష్ణువు}; తన = తన యొక్క; సొమ్మున్ = సందలను; సకలంబున్ = సమస్తము; తప్పక = వదలక; నీకున్ = నీకు; ఇచ్చెన్ = ఇచ్చివేసెను; దండ = శిక్షించుటకు; యోగ్యుడు = తగినవాడు; కాడు = కాడు; దానపరుడున్ = దాత; కరుణింపన్ = దయచూచుటకు; అర్హుండు = తగినవాడు; కమలలోచన = పద్మాక్ష; నీ = నీ; కున్ = కు; విడిపింపుము = బంధవిముక్తుని చేయుము; ఈతని = ఇతని యొక్క; వెఱపు = బెదురు; తీరన్ = పోవునట్లు; తోయపూరము = జలములను; చల్లి = చల్లి; దూర్వాంకురములన్ = గరికపోచలతో; చేరి = దగ్గరకొచ్చి; నీ = నీ యొక్క; పదములన్ = పాదములను; అర్చించునట్టి = పూజించెడి.
భక్తి = భక్తి; యుక్తుడు = కలవాడు; లోకేశుపదమునందు = సర్వలోకాధిపతివైన; నీవు = నీవు; ప్రత్యక్షముగ = ఎదురుగ; వచ్చి = వచ్చి; నేడు = ఇవాళ; వేడన్ = అడుగుగ; ఎఱిగి = తెలిసికూడ; తన = తన యొక్క; రాజ్యమున్ = రాజ్యము; అంతయున్ = సమస్తమును; ఇచ్చిన = ఇచ్చివేసిన; అట్టి = అటువంటి; బలి = బలి; కిన = కి; తగున = న్యాయమా; అయ్య = తండ్రి; దృఢ = గట్టిగా; పాశ = తాళ్ళతో; బంధనంబు = కట్టవేయుట.

భావము:

“ఓ దేవదేవా! దేవవంద్యా! జగన్నాధా! కమాలాల వంటి కన్నులుగల శ్రీహరీ! నీవు సకల ప్రాణులకు ఈశ్వరుడవు, ఆరాధ్యనీయుడవు; బలిచక్రవర్తి గొప్పదాత. ఇతడు నీకు తన ధనమంతా ఇచ్చేసాడు. ఇతడు శిక్షింపదగినవాడు కాదు. నీచే దయచూపదగినవాడు. ఇతని భయాన్ని పోగొట్టి బంధవిముక్తుణ్ణి చెయ్యి. ఇతడు నీ పాదాలను కోరి జలములతో అభిషేకించిన, గరిక పత్రితో పూజించిన భక్తుడు. లోకాధిపతివి అయిన నీవు స్వయంగా దరిచేరి అడగడాన్ని తెలిసి కూడా తన రాజ్యమంతా ఇచ్చేసాడు. ఇటువంటి ఈ బలిని త్రాళ్ళతో కట్టివేయడం న్యాయము కాదయ్యా!”