పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : త్రికూటపర్వత వర్ణన

  •  
  •  
  •  

8-25-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భిల్లీ భిల్ల లులాయక
ల్లుక ఫణి ఖడ్గ గవయ లిముఖ చమరీ
ఝిల్లీ హరి శరభక కిటి
ల్లాద్భుత కాక ఘూక యమగు నడవిన్.

టీకా:

భిల్లీ = భిల్లస్త్రీలు, చెంచితలు; భిల్ల = భిల్లులు, చెంచులు; లులాయక = అడవిదున్నలు; భల్లుక = ఎలుగుబంట్లు; ఫణి = పాములు; ఖడ్గ = ఖడ్గమృగములు; గవయ = గురుపోతులు; వలిముఖ = కొండముచ్చలు; చమరీ = చమరీమృగములు; ఝిల్లీ = ఈలపురుగు; హరి = సింహములు; శరభక = శరభమృగములు; కిటి = సీమపందులు; మల్లాద్భుత = అద్భుతమైన కోతులు; కాక = కాకులు; ఘూక = గుడ్లగూబలు; మయము = నిండుగా యున్నది; అగు = అయిన; అడవిన్ = అడవి నందు.

భావము:

ఆ త్రికూటం దగ్గర ఉన్న అడవి నిండా చెంచిత స్త్రీలు, చెంచు పురుషులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గమృగాలు,గురుపోతులు,కొండముచ్చులు,చమరీమృగాలు, ఈలపురుగులు,సింహాలు,శరభాలు, సీమపందులు, కోతులు, కాకులు, గుడ్ల గూబలు ఉంటాయి.
రహస్యార్థం -తృష్ణ అనే చపల స్వభావ కోతులు, కామం అనే కాముకుని తీవ్ర సంకల్పం గల ఈల పురుగులు, పగ అనే రాత్రి తప్ప పగలు దృష్టి లేని గుడ్లగూబలు, కలిగి ఆత్మ దృష్టి, ప్రాపంచిక దృష్టి కలిగి ఉన్న సంసారం అనే అడవి యందు...