పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : త్రికూటపర్వత వర్ణన

  •  
  •  
  •  

8-23.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూరి భూజ లతా కుంజ పుంజములును
మ్రోసి పఱతెంచు సెలయేటి మొత్తములును
రఁగి తిరిగెడు దివ్యవిమానములును
ఱులఁ గ్రీడించు కిన్నరయముఁ గలిగి.

టీకా:

రాజ = రాజులలో; ఇంద్ర = ఉత్తముడ; విను = వినుము; సుధారాశి = పాలసముద్రము; లోన్ = అందు; ఒక = ఒక; పర్వతము = కొండ; త్రికూటంబు = త్రికూటము; అనన్ = అనగా; తనరుచున్ = అతిశయించుతు; ఉండున్ = ఉండును; యోజన = యోజనము; ఆయుతము = పొడవు; అగు = అయిన; ఉన్నతత్వంబును = ఎత్తు; అంతియ = అంతే; వెడలుపున్ = వెడల్పు; అతిశయిల్లు = అతిశయించెడి; కాంచన = బంగారము; అయస్సార = ఉక్కు; కలధౌత = వెండి; మయములు = నిండినవి; ఐ = అయ్యి; మూడు = మూడు (3); శృంగంబులు = శిఖరములు; మొనసి = కలిగి; ఉండున్ = ఉండును; తట = చరియలు; శృంగ = శిఖరము లందలి; బహు = అనేకమైన; రత్న = రత్నములచేతను; ధాతు = ఖనిజములచేతను; చిత్రితములు = రంగులు వేయబడినవి; ఐ = అయ్యి; దిశలు = దిక్కులు; భూ = భూమి; నభములున్ = ఆకాశములు; తేజరిల్లున్ = ప్రకాశించును.
భూరి = మిక్కిలి పెద్దవైన; భూజ = చెట్లు; లతా = లతలు; కుంజ = పొదరిండ్ల; పుంజములును = సమూహములును; మ్రోసి = ధ్వనించుచు; పఱతెంచు = ప్రవహించెడి; సెలయేటి = కొండవాగుల; మొత్తములును = సమూహములును; మరగి = మోహములోపడి; తిరిగెడు = వర్తించెడి; దివ్య = దివ్యమైన; విమానములునున్ = విమానములు; చఱులన్ = కొండచరియ లందు; క్రీడించు = వినోదించెడి; కిన్నర = కిన్నరల; చయమున్ = సమూహములును; కలిగి = ఉండి.

భావము:

“మహారాజా! పాలసముద్రంలో త్రికూట మనే పర్వతం ఉంది. దాని ఎత్తు, వెడల్పు ఒక్కొక యోజనము (4 క్రోసులు అంటే సుమారు 14 కిలో మీటర్లు). దానికి బంగారపు, వెండి, ఇనుప శిఖరాలు మూడు ఉన్నాయి. కొండ సానువులలో, శిఖరాలలో యున్న రత్నాలు, ధాతువుల వలన దిక్కులు, భూమి, ఆకాశం చిత్రమైన రంగులతో మెరుస్తుంటాయి. దాని మీద పెద్ద పెద్ద చెట్లు, తీగలు, పొదలు, గలగలలాడే సెలయేర్లు ఉన్నాయి. వీటికి అలవాటుపడిన దేవతలు విమానాలలో తిరుగుతుంటారు. ఆ కొండ చరియలందు కిన్నరులు విహరిస్తుంటారు.
రహస్యార్థం -సుధారాశి, పాలసముద్రం అనగా ఇతరం ఏది చూడని, వినని, ఎరుగని, చలించని సహజ బ్రహ్మానంద స్థితి యగు పరబ్రహ్మము. అందు యోజనోన్నతం అనగా అనంత స్వరూపం గల పొడవు, వెడల్పు అనే పడుగు పేకలుగా కూర్చబడిన పరబ్రహ్మము. అందు గుణసామ్యం అగు ప్రకృతి, రజోగుణం (కాంచనం, బంగారం), తమోగుణం (అయస్సారం, ఇనుము), సత్వగుణం (కలధౌత, వెండి) అనే త్రిగుణాలతో కూడినదిగా వ్యక్తమగుచున్నది. ఆయా త్రిగుణాల ప్రతిబింబాలు అయిన బ్రహ్మ, విష్ణు, రుద్రులు అనే మూడు శృంగములచే త్రికూట పర్వతం ప్రకాశించుతున్నది. అక్కడి చరియల సూత్రాత్మ (సూర్య చంద్రాది) కాంతులచే భాసమానములు అయిన సంసారం అనే మహా వృక్షాలు, ఆశ అనే లతలచే నిర్మితమైన పొదరిళ్ళు, వాసనా ప్రవాహాలు అనే సెలయేర్లు మరిగి దివ్యవిమానాలు అనే శరీరాలు, విశ్వ, తైజస, ప్రాజ్ఞులు అను కిన్నరులు తిరుగుతున్నారు.