పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : త్రివిక్రమ స్ఫురణంబు

  •  
  •  
  •  

8-629-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వబంధములఁ బాసి బ్రహ్మలోకంబునఁ-
గాపురంబులు చేయు నులు రాజు
లా మరీచ్యాదులు, నా సనందాదులు-
నా దివ్యయోగీంద్రు చట నెపుడు
మూర్తిమంతంబులై మ్రోయు పురాణ త-
ర్కామ్నాయ నియమేతిహాస ధర్మ
సంహితాదులు గురుజ్ఞానాగ్నినిర్దగ్ధ-
ర్ములై మఱియును లుగునట్టి

8-629.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వార లెల్లఁ జొచ్చి చ్చి సర్వాధిపు
నంఘ్రిఁ జూచి మ్రొక్కి ధిక భక్తిఁ
మ మనంబు లందుఁ లచు నిధానంబుఁ
గంటి మనుచు నేఁడు మంటి మనుచు.

టీకా:

భవ = సంసార; బంధములన్ = బంధములను; పాసి = వదలి; బ్రహ్మలోకమునన్ = సత్యలోకమునందు; కాపురంబులుచేయు = నివాసము ఉండెడి; ఘనులు = గొప్పవారు; రాజులు = రాజులు; ఆ = ఆ; మరీచి = మరీచి; ఆదులున్ = మున్నగువారు; ఆ = ఆ; సనంద = సనందుడు; ఆదులున్ = మున్నగువారు; ఆ = ఆ; దివ్యయోగీంద్రుల్ = దేవర్షులు; అచటన్ = అక్కడ; ఎపుడున్ = ఎప్పుడు; మూర్తిమంతంబులు = రూపుదాల్చినవి; ఐ = అయ్యి; మ్రోయు = మారుమోగెడి; పురాణ = పురాణములు {పురాణము - పురాతన చరిత్రము, 1సర్గ (సృష్టి) 2ప్రతిసర్గ (ప్రతిసృష్టి) 3(మను)వంశము 4మన్వంతరము 5వంశానుచరితము అను పంచలక్షణములు కలవి ఇవి 18}; తర్క = తర్కశాస్త్రములు {తర్కము - శాస్త్రములు (నియమన గ్రంథములు) ఆరింటిలోనిది, 1తర్కము 2వ్యాకరణము 3ధర్మము 4మీమాంస 5వైద్యము 6జ్యోతిషము}; ఆమ్నాయ = వేదములు; నియమ = నియమము {నియమము - అష్టాంగయోగములలోని శరీరముకంటె భిన్నమైన మృజ్జలాదులు సాధనములుగా కలిగి నిత్యముగా ఆచరింపదగిన ఒక యోగాంగము (ఇది దశవిధము - 1తపము 2సంతోషము 3ఆస్తికత్వము 4దానము 5భగవదర్చన 6వేదాంతశ్రవణము 7లజ్జ 8మతి 9జపము 10వ్రతము}; ఇతిహాస = ఇతిహాసములు {ఇతిహాసము - పూర్వము జరిగిన కథ, రామాయణ భారతములు}; ధర్మ = ఉపనిషత్తులు; సంహిత = వేదాంగములు; ఆదులున్ = మొదలగునవాని; గురు = గొప్ప; జ్ఞాన = జ్ఞానము యనెడి; అగ్నిన్ = అగ్నిలో; నిర్దగ్ధ = పూర్తిగా కాలిపోయిన; కర్ములు = కర్మవాసనలు కలవారు; ఐ = అయ్యి; మఱియును = అతిశయించి; కలుగునట్టి = ఉండెడి.
వారలు = వారు; ఎల్లన్ = అందరును; చొచ్చి = తోసుకు; వచ్చి = వచ్చి; సర్వాధిపున్ = విష్ణుని; అంఘ్రిన్ = పాదములను; చూచి = దర్శించుకొని; మ్రొక్కిరి = నమస్కరించిరి; అధిక = మిక్కిలి; భక్తిన్ = భక్తితోటి; తమ = వారియొక్క; మనంబులన్ = మనసుల; అందున్ = లో; తలచు = భావించెడి; నిధానంబున్ = పెన్నిధిని; కంటిమి = దర్శించితిమి; అనుచున్ = అనుకొనుచు; నేడున్ = ఇవాళ; మంటిమి = ధన్యులమైతిమి; అనుచున్ = అనుకొనుచు.

భావము:

సంసారబంధాలను త్రెంచుకొని మోక్షాన్ని పొంది బ్రహ్మ లోకంలో నివాసం చేస్తున్న మహారాజులు మరీచీ మొదలైన వారూ; సనందుడూ మొదలైన దేవర్షులూ; అక్కడ ఎప్పుడూ ఆకారం ధరించి మారుమ్రోగుతుండే పురాణాలూ, తర్కశాస్త్రాలూ, వేదాలూ, వేదాంగాలు, ఇతిహాసాలూ, ధర్మశాస్తాలూ; మహజ్ఞానులైన పుణ్యాత్ములూ మున్నగువారు అందరూ ఆ సర్వనియంత అయిన మహావిష్ణువు పాదాన్ని దర్శించారు. ఆ పాదానికి మిక్కిలి భక్తితో మ్రొక్కారు. మనస్సులలో “మేము భావిస్తున్న పెన్నిధీ కనిపించింది. ఈనాడు మేము ధన్యులం అయ్యాము.” అనుకున్నారు.