పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట

  •  
  •  
  •  

8-620-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర
క్ష పక్షి దేవతాహి పతులు
పొగడి రతని పెంపుఁ; బుష్పవర్షంబులు
గురిసె దేవతూర్యకోటి మొరసె.

టీకా:

గ్రహ = గ్రహములు; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులు; సిద్ధ = సిద్ధులు; గంధర్వ = గంధర్వులు; కిన్నర = కిన్నరలు; యక్ష = యక్షులు; పక్షి = గరుడులు; దేవత = దేవతలు; అహిపతులు = సర్పరాజులు; పొగిడిరి = శ్లాఘించిరి; అతని = అతని యొక్క; పెంపున్ = ఔదార్యమును; పుష్ప = పూల; వర్షంబులున్ = వానలు; కురిసె = కురిసెను; దేవ = దివ్య; తూర్య = వాద్య; కోటి = సమూహములు; మొరసెన్ = మోగినవి.

భావము:

బలిచక్రవర్తి ఔదార్యాన్ని గ్రహాలూ, మునీశ్వరులూ. సిద్ధులూ, గంధర్వులూ, కిన్నరులూ, యక్షులూ, గరుడులూ, దేవతలూ, సర్పరాజులూ అందరూ అతని గొప్పదనాన్ని పొగిడారు. పూలవానలు కురిపించారు. దేవతల విజయ దుందుభులు మారుమ్రోగాయి.