పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట

  •  
  •  
  •  

8-619-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో
చిట్టి బుద్ధు లిట్టి పొట్టివడుగు
పొట్ట నున్న వెల్ల బూమెలు" నని నవ్వి
యెలమి ధరణి దాన మిచ్చె నపుడు.

టీకా:

పుట్టి = పుట్టినతరవాత; నేర్చుకొనెనొ = నేర్చుకొన్నాడో లేక; పుట్టక = పుట్టుటకుముందే; నేర్చెనో = నేర్చుకొన్నాడో; చిట్టి = లీలా, ముద్దుల {చిట్టి - చిట్టకము కలవి, లీలమాత్రపు}; బుద్ధులు = బుద్ధులు; ఇట్టి = ఇటువంటి; పొట్టి = పొట్టివాడైన; వడుగు = బ్రహ్మచారి; పొట్టన్ = కడుపునిండా; ఉన్నవి = ఉన్నట్టివి; ఎల్ల = అన్ని; బూమెలున్ = మాయలు; అని = అని; నవ్వి = నవ్వి; ఎలమిన్ = సంతోషముతో; ధరణిదానమున్ = భూదానమును; ఇచ్చెన్ = ఇచ్చెను; అపుడు = అప్పుడు.

భావము:

ఈ పొట్టి బ్రహ్మచారి ఈ చిట్టి బుద్ధులు పుట్టేకా నేర్చుకున్నాడా? పుట్టకముందే నేర్చుకున్నాడా? ఇతని పొట్ట నిండా మాయలే అంటు నవ్వి సంతోషంగా భూదానం యిచ్చాడు.