పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట

  •  
  •  
  •  

8-616-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లుగావున నే దానంబును భూదానంబునకు సదృశంబు గానేరదు; గావున వసుంధరా దానం బిచ్చితి; వుభయలోకంబులం గీర్తి సుకృతంబులు పడయు" మని పలికి య మ్మాయావటుం డిట్లనియె.

టీకా:

అట్లుగావున = అందుచేత; ఏ = ఎట్టి; దానంబును = దానముకూడ; భూదానంబున్ = భూదానమున; కున్ = కు; సదృశంబున్ = సమానమైనది; కానేరదు = కాలేదు; కావున = అందుచేత; వసుంధరాదానంబు = భూదానము; ఇచ్చితివి = ఇచ్చినావు; ఉభయ = ఇహపరరెండు; లోకంబులన్ = లోకములలోను; కీర్తి = యశము; సుకృతంబులు = పుణ్యములు; పడయుము = పొందుదువుగాక; అని = అని; పలికి = చెప్పి; ఆ = ఆ; మాయా = కపట; వటుండు = బ్రహ్మచారి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అందుచేత, ఏదానమూ భూదానానికి సమానంకాదు. భూదానం ఇచ్చిన నీకు ఇహ పర లోకాలు రెంటిలోనూ కీర్తీ, పుణ్యమూ కలుగుతుంది.” అని పలికి మాయాబ్రహ్మచారి మళ్లీ ఇలా అన్నాడు.