పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట

  •  
  •  
  •  

8-615-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"క్షితి దానమిచ్చు నతఁడును
తికాంక్షఁ బరిగ్రహించు తఁడును దురిత
చ్యుతులై శతవత్సరములు
మఖ లోకమునఁ గ్రీడ లుపుదు రెలమిన్.

టీకా:

క్షితిదానము = భూదానమును; ఇచ్చు = ఇచ్చెడి; అతడున్ = వాడు; అతి = మిక్కిలి; కాంక్షన్ = కోరికతో; పరిగ్రహించు = తీసుకొనెడి; అతడున్ = వాడు; దురిత = పాపములు; చ్యుతులు = నశించినవి; ఐ = అయ్యి; శత = నూరు (100); వత్సరములు = సంవత్సరములు; శతమఖ = ఇంద్రుని; లోకమునన్ = లోకమునందు; క్రీడన్ = విహరించుట; సలుపుదురు = చేసెదరు; ఎలమిన్ = సంతోషముతో.

భావము:

అంతట మాయాబ్రహ్మచారి బలిచక్రవర్తి తో ఇలాఅన్నాడు. “భూమిని దానం ఇచ్చినవాడికి; దానిని ప్రీతితో తీసుకున్నవాడికి పాపాలు నశించిపోతాయి. వారు సంతోషంగా నూరు యాగాలు చేస్తే దక్కే స్వర్గలోకంలో నూరేండ్లు విహరిస్తారు.