పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట

  •  
  •  
  •  

8-614-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లి చేసిన దానమునకు
ళినాక్షుఁడు నిఖిలభూత నాయకుఁ డగుటం
కల మని దశదిక్కులు
ళిబళి యని పొగడె భూతపంచక మనఘా!

టీకా:

బలి = బలి; చేసిన = చేసినట్టి; దానమున్ = దానమున; కున్ = కు; నళినాక్షుండు = విష్ణువు; నిఖిల = సమస్తమైన; భూత = జీవుల; నాయకుడు = ప్రభువు; అగుటన్ = అగుటవలన; కలకలము = కలకల; అని = అని; దశ = పది; దిక్కులు = దిశలు {దశదిక్కులు - 4దిక్కులు 4మూలలు పైన కింద మొత్తం 10వైపులు}; భళిభళి = ఓహో ఓహో; అని = అని; పొగడె = శ్లాఘించెను; భూతపంచకము = పంచభూతములును {పంచభూతములు - 1పృథివి 2అప్పు 3తేజస్సు 4వాయువు 5ఆకాశము}; అనఘా = పుణ్యుడా.

భావము:

ఓ పరీక్షన్మహారాజా! సర్వ భూతాలకూ విష్ణువు అధిపతి కదా. కనుక, ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే దిక్కులు అన్నీ కళకళలాడాయి. పంచభూతాలూ “భళి భళి” అని పొగిడాయి.