పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట

  •  
  •  
  •  

8-612-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునిజన నియమాధారను
నితాసుర యువతి నేత్రలకణ ధారన్
నుజేంద్ర నిరాధారను
జాక్షుఁడు గొనియె బలివిర్జితధారన్.

టీకా:

ముని = మునుల; జన = సమూహముయొక్క; నియమ = నిష్ఠలకు; ఆధారను = ఆధారభూతమైనదానిని; జనిత = కలిగించబడిన; అసుర = రాక్షస; యువతి = స్త్రీల; నేత్రజల = కన్నీటి; కణ = బిందువుల; ధారన్ = ధారకలదానిని; దనుజేంద్ర = బలిచక్రవర్తిని; నిరాధారను = నిరాధారుని చేసెడిదానిని; వనజాక్షుడు = విష్ణువు; కొనియె = గ్రహించెను; బలి = బలిచేత; వివర్జిత = విడువబడిన; ధారన్ = దానజలధారను.

భావము:

బలిచక్రవర్తి అందించిన దానధారను పద్మాలవంటి కన్నులు గలస్వామి వామనుడు స్వీకరించాడు. ఆ జలధార మునుల నియమాలకు ఆధారమైనది. రాక్షసస్త్రీలను కన్నీటి పాలుచేసేది. రాక్షసరాజులను నిరాధారులుగా మార్చేది.