పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట

  •  
  •  
  •  

8-601-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యవసరంబునఁ గపటవటునకు న ద్దానవేంద్రుం డిట్లనియె.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; కపట = మాయా; వటున్ = బ్రహ్మచారి; కున్ = కి; ఆ = ఆ; దానవేంద్రుడు = రాక్షసరాజు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

అప్పుడు మాయా బ్రహ్మచారి వామనుడితో, ఆ రాక్షసేంద్రుడు బలిచక్రవర్తి ఇలా అన్నాడు.