పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలి దాన నిర్ణయము

  •  
  •  
  •  

8-598-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రతుక వచ్చుఁగాఁక హుబంధనములైన
చ్చుఁగాక లేమి చ్చుఁగాక
జీవధనములైనఁ జెడుఁగాక పడుఁగాక
మాటఁ దిరుఁగ లేరు మానధనులు.

టీకా:

బ్రతుకన్ = బాగాబతుక; వచ్చుగాక = కలిగినసరే; బహు = పలువిధముల; బంధనములు = కష్టములు; ఐనన్ = కలిగిన; వచ్చుగాక = కలిగినసరే; లేమి = పేదరికము; వచ్చుగాక = కలిగినసరే; జీవ = ప్రాణ; ధనములు = సంపదలు; ఐనన్ = అయినను; చెడుగాక = హానికలగనిమ్ము; పడుగాక =చావు వచ్చినా; మాట = ఇచ్చినమాట; తిరుగలేరు = తప్పలేరు; మానధనులు = అభిమానవంతులు.

భావము:

బాగా బ్రతికినా; పెక్కుకష్టాలకు గురి అయినా; పేదరికం వచ్చినా; ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా; కడకు చావు సంభవించినా సరే మానధనులు మాట తప్పలేరు.