పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలి దాన నిర్ణయము

  •  
  •  
  •  

8-596-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నడుం బరువేఁడఁ బోఁడట; యేకలుం డఁట; కన్న వా
న్నదమ్ములు నైన లేరఁట; న్నివిద్యల మూల గో
ష్ఠిన్నెఱింగిన ప్రోడ గుజ్జఁట; చేతు లొగ్గి వసింప నీ
చిన్ని పాపనిఁ ద్రోసిపుచ్చఁగఁ జిత్త మొల్లదు సత్తమా! "

టీకా:

ఎన్నడున్ = ఎప్పుడు; పరున్ = ఇతరులను; వేడన్ = అడుగుటకు; పోడు = వెళ్ళడు; అటన్ = అట; ఏకలుండు = ఒంటరి, అసహాయుడు; అట = అట; కన్నవారు = తల్లిదండ్రులు; అన్నదమ్ములు = సోదరులు; ఐనన్ = అయినను; లేరు = లేరు; అటన్ = అట; అన్ని = సర్వ; విద్యలన్ = విద్యలయొక్క; మూలగోష్ఠి = ముఖ్యసారాంశమును; ఎఱింగిన = తెలిసిన; ప్రోడగుజ్జు = బహునేర్పరి; అటన్ = అట; చేతులు = చేతులు; ఒగ్గి = చాచి; వసింపన్ = ఉండగా; ఈ = ఈ; చిన్నిపాపనిన్ = పసివానిని; త్రోసిపుచ్చగన్ = గెంటివేయుటకు; చిత్తము = మనసు; ఒల్లదు = ఒప్పుటలేదు; సత్తమా = సమర్థుడా.

భావము:

మహానుభావా! ఈ పొట్టి పిల్లాడు ఎప్పుడు ఇతరులను అడగటం అన్నది లేదుట. ఒంటరి యట. కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు లేరుట. అన్ని విద్యల మూల సారం తెలిసిన నేర్పరి యట. నా ముందు చేతులు చాపి ఇలా నిల్చున్న ఇలాంటి పసివాడిని గెంటేయటానికి నాకు మన సొప్పటం లేదు."