పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలిదాననిర్ణయము

 •  
 •  
 •  

8-595-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మేరువు దల క్రిం దైనను
బారావారంబు లింకఁ బాఱిన లోలో
ధారుణి రజమై పోయినఁ
దారాధ్వము బద్ధమైనఁ ప్పక యిత్తున్.

టీకా:

మేరువు = మేరుపర్వతము; తలక్రింద = తలకిందులు; ఐనన్ = అయిపోయినసరే; పారావారంబులు = సముద్రములు; ఇంకబాఱినన్ = ఇంకిపోయినసరే; లోలోన్ = లోపలలోపలే; ధారుణి = భూమండలము; రజము = పొడి; ఐపోయినన్ = అయిపోయినసరే; తారాధ్వము = ఆకాశము {తారాధ్వము - తార (నక్షత్రపు) అధ్వము (దారి), ఆకాశము}; బద్ధమైనన్ = బద్దలైపోయినసరే; తప్పక = తప్పకుండ; ఇత్తున్ = ఇచ్చెదను.

భావము:

మేరుపర్వతం తిరగబడితే బడవచ్చు, సప్తసముద్రాలు ఇంకిపోతే పోవచ్చు, ఈ భూమండలం అంతా తనలో తనే పొడిపొడి అయితే కావచ్చు, ఆకాశం బద్దలు అయితే కావచ్చు. కాని నేను మాత్రం ఇస్తానన్న దానం తప్పకుండా ఇస్తాను.

8-596-మత్త.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

న్నడుం బరువేఁడఁ బోఁడట; యేకలుం డఁట; కన్న వా
న్నదమ్ములు నైన లేరఁట; న్నివిద్యల మూల గో
ష్ఠిన్నెఱింగిన ప్రోడ గుజ్జఁట; చేతు లొగ్గి వసింప నీ
చిన్ని పాపనిఁ ద్రోసిపుచ్చఁగ జిత్త మొల్లదు సత్తమా! "

టీకా:

ఎన్నడున్ = ఎప్పుడు; పరున్ = ఇతరులను; వేడన్ = అడుగుటకు; పోడు = వెళ్ళడు; అటన్ = అట; ఏకలుండు = ఒంటరి, అసహాయుడు; అట = అట; కన్నవారు = తల్లిదండ్రులు; అన్నదమ్ములు = సోదరులు; ఐనన్ = అయినను; లేరు = లేరు; అటన్ = అట; అన్ని = సర్వ; విద్యలన్ = విద్యలయొక్క; మూలగోష్ఠి = ముఖ్యసారాంశమును; ఎఱింగిన = తెలిసిన; ప్రోడగుజ్జు = బహునేర్పరి; అటన్ = అట; చేతులు = చేతులు; ఒగ్గి = చాచి; వసింపన్ = ఉండగా; ఈ = ఈ; చిన్నిపాపనిన్ = పసివానిని; త్రోసిపుచ్చగన్ = గెంటివేయుటకు; చిత్తము = మనసు; ఒల్లదు = ఒప్పుటలేదు; సత్తమా = సమర్థుడా.

భావము:

మహానుభావా! ఈ పొట్టి పిల్లాడు ఎప్పుడు ఇతరులను అడగటం అన్నది లేదుట. ఒంటరి యట. కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు లేరుట. అన్ని విద్యల మూల సారం తెలిసిన నేర్పరి యట. నా ముండదు చేతులు చాపి ఇలా నిల్చున్న ఇలాంటి పసివాడిని గెంటేయటానికి నాకు మన సొప్పటం లేదు."

8-597-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యిట్లు సత్య పదవీ ప్రమాణ తత్పరుండును, వితరణ కుతూహల సత్త్వరుండును, విమల యశస్కుండును, దృఢ మనస్కుండును, నియతసత్యసంధుండును, నర్థిజన కమలబంధుండును నైన బలిం జూచి శుక్రుండు గోపించి "మదీయ శాసనం బతిక్రమించితివి గావున శీఘ్రకాలంబునఁ బదభ్రష్టుండవుఁ గ" మ్మని శాపం బిచ్చె బలియును గురుశాపతప్తుండయ్యు ననృతమార్గంబు నకభిముఖుండుఁ గాకుండె; అప్పుడు.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; సత్యపదవీ = సత్యమార్గమునుండి; ప్రమాణ = చలించని; తత్పరుండు = నిష్ఠ కలవాడు; వితరణ = దానముచేయవలెనని; కుతూహల = కౌతుకము; సత్వరుండును = తహతహలాడువాడు; విమల = నిర్మలమైన; యశస్కుండును = కీర్తి కలవాడు; దృఢ = గట్టి; మనస్కుండును = మనసు కలవాడు; నియత = నియమబద్దమైన; సత్యసంధుడును = సత్యసంధుడు; ఐనన్ = అయినట్టి; బలిన్ = బలిని; చూచి = చూసి; శుక్రుండు = శుక్రుడు; కోపించి = కోపగించుకొని; మదీయ = నా యొక్క; శాసనంబున్ = ఆజ్ఞను; అతిక్రమించితివి = మీరితివి; కావునన్ = కనుక; శీఘ్ర = కొద్ది; కాలంబునన్ = కాలములోనే; పద = పదవినుండి; భ్రష్టుండవు = జారిపోయినవాడవు; కమ్ము = అయిపో; అని = అని; శాపంబున్ = శాపమును; ఇచ్చెన్ = ఇచ్చెను; బలియునున్ = బలి; గురు = గురువు యొక్క; శాప = శాపమునకు; తప్తుండు = గురైనవాడు; అయ్యున్ = అయినప్పటికి; అనృత = అసత్యము; మార్గంబున్ = వైపునకు; అభిముఖుండు = వెళ్ళువాడు; కాకుండెన్ = కాలేదు; అప్పుడు = ఆ సమయమునందు.

భావము:

అతను ఇచ్చిన మాటతప్పని దీక్ష పట్టినవాడు; దానం చేయాలని మిక్కిలి ఆసక్తి కలవాడు; నిర్మలమైన కీర్తి ప్రతిష్ఠలు కలవాడు; చాలా గట్టి మనస్సు కలవాడు; సత్యమే పలుకుతాను అనే నియమం కలవాడు; దానం అడిగే వారికి దగ్గర బంధువు; అటువంటి బలిచక్రవర్తి పలికిన పలుకు విని, అతడు వామనునికి దానమిచ్చే కుతూహలంతో తహతహలాడడం చూసి, అతనిపై శుక్రాచార్యుడు కోపగించుకున్నాడు. “నా ఆజ్ఞ మీరావు కాబట్టి త్వరలో పదవీభ్రష్టుడవు అవుతావు. ” అని శాపము ఇచ్చాడు. గురువుగారి శాపానికి గురైనా కూడా బలిచక్రవర్తి బాధపడలేదు. అతడు అసత్యమార్గం అవలంబించ లేదు. అప్పుడు. . .

8-598-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

బ్రతుక వచ్చుఁగాఁక హుబంధనములైన
చ్చుఁగాక లేమి చ్చుఁగాక
జీవధనములైనఁ జెడుఁగాక పడుఁగాక
మాటఁ దిరుఁగ లేరు మానధనులు.

టీకా:

బ్రతుకన్ = బాగాబతుక; వచ్చుగాక = కలిగినసరే; బహు = పలువిధముల; బంధనములు = కష్టములు; ఐనన్ = కలిగిన; వచ్చుగాక = కలిగినసరే; లేమి = పేదరికము; వచ్చుగాక = కలిగినసరే; జీవ = ప్రాణ; ధనములు = సంపదలు; ఐనన్ = అయినను; చెడుగాక = హానికలగనిమ్ము; పడుగాక = నష్టపోనిమ్ము; మాట = ఇచ్చినమాట; తిరుగలేరు = తప్పలేరు; మానధనులు = అబిమానవంతులు.

భావము:

బాగా బ్రతికినా; పెక్కుకష్టాలకు గురి అయినా; పేదరికం వచ్చినా; ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా; కడకు చావు సంభవించినా సరే మానధనులు మాట తప్పలేరు.

 • ఉపకరణాలు:
 •  
 •  
 •