పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు దాన మడుగుట

  •  
  •  
  •  

8-568-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"న్నమాటలెల్ల నొప్పును విప్రుండ!
త్య గతులు వృద్ధ మ్మతంబు;
డుగఁ దలఁచి కొంచె డిగితివో చెల్ల;
దాత పెంపు సొంపుఁ లఁపవలదె. "

టీకా:

ఉన్నమాటలు = చెప్పినవి; ఎల్లన్ = అన్ని; ఒప్పును = తగును; విప్రుండ = బ్రాహ్మణుడా; సత్య = యదార్థమైన; గతులు = విధములు; వృద్ధ = పెద్దలచే; సమ్మతంబులు = అంగీకరింపబడునవి; అడుగన్ = అడగవలెనని; తలచి = అనుకొని; కొంచెము = కొద్దిగానే; అడిగితివో = అడిగితివేమి; చెల్ల = అరె; దాత = దాతయొక్క; పెంపు = గొప్పదనమును; సొంపున్ = మంచితనమును; తలపన్ = భావించ; వలదె = వద్దా.

భావము:

“ఓ బ్రాహ్మణుడా! నీ మాటలన్నీ ఉన్నమాటలే. వాటిని ఒప్పుకోవలసిందే. ముమ్మాటికీ సత్యములే. అందుకు పెద్దలు కూడా కాదనరు. కానీ పాపం అడక్క అడక్క అడిగి ఇంత కొంచెమే అడిగావు. చాలా బాగుంది. కానీ అడిగే టప్పుడు దాత గొప్ప దనాన్నీ అతని గొప్ప గుణాన్ని తలచాలి కదా!”