పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని సమాధానము

 •  
 •  
 •  

8-552-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు?-
నొక చో టనక యెందు నుండ నేర్తు;
నెవ్వనివాఁడ నం చేమని నుడువుదు?-
నా యంతవాఁడనై డవనేర్తు;
నీ నడవడి యని యెట్లు వక్కాణింతుఁ?-
బూని ముప్పోకల బోవ నేర్తు;
దినేర్తు నిదినేర్తు ని యేలఁ జెప్పంగ?-
నేరుపు లన్నియు నేన నేర్తు;

8-552.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

8-552.1-ఆ.
నొరులుఁ గారు నాకు నొరులకు నే నౌదు
నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు
సిరియుఁ దొల్లి గలదు చెప్పెద నా టెంకి
సుజనులందుఁ దఱచు చొచ్చియుందు.

టీకా:

ఇది = దీనిని; నా = నా; కున్ = కు; నెలవు = నివాసము; అని = అని; ఏ = ఏ; రీతిన్ = విధముగా; పలుకుదు = చెప్పెగలను; ఒక = ప్రత్యేకముగ ఒక; చోటు = ప్రదేశము; అనక = అనకుండ; ఎందున్ = ఎక్కడైనను; ఉండనేర్తున్ = ఉండగలను; ఎవ్వని = ఎవరికిచెందిన; వాడన్ = వాడిని; అంచున్ = అనుచు; ఏమి = ఏమి; అని = అని; నుడువుదున్ = చెప్పెగలను; నా = నా; అంతవాడను = అంతవాడినినేనే; ఐ = అయ్యి; నడవనేర్తు = స్వేచ్చగావర్తించెదను; ఈ = ఇలాంటి; నడవడి = వర్తన కలవాడను; అని = అని; ఎట్లు = ఎలా; వక్కాణింతున్ = చెప్పగలను; పూని = ధృతితో; ముప్పోకలన్ = మూడు పోకడలు, పెక్కు త్రోవలను {ముప్పోకలు - మూడుపోకడలు, 1సత్త్వగుణము 2రజగుణము 3తమోగుణములుకల మూడువిధములు, 1శ్రవణ 2అధ్యయన 3ఉపన్యాస అనెడి మూడు విద్యలు, 1ముందుకు 2వెనుకుక 3పక్కలకు అనెడి మూడు గమనములు}; పోవనేర్తు = వెళ్ళగలను; అది = అది; నేర్తున్ = తెలుసును; ఇది = ఇది; నేర్తున్ = తెలుసును; అని = అని; ఏల = ఎందుకు; చెప్పంగన్ = చెప్పడము; నేరుపులు = విద్యలు; అన్నియున్ = అన్ని; నేన = నేను; నేర్తున్ = తెలుసుకున్నాను; ఒరులు = ఇతరులు; కారు = ఏమీకారు.
నా = నా; కున్ = కు; ఒరుల = ఇతరుల; కున్ = కు; నేన్ = నేను; ఔదు = ఉపయోగపడెదను; ఒంటి = ఒంటరి, అనితరమైన; వాడన్ = వాడిని; చుట్టము = బంధువు; ఒకడు = ఒక్కడుకూడ; లేడు = లేడు; సిరియున్ = లక్ష్మీదేవి, సంపద; తొల్లి = ఇంతకుముందు; కలదు = ఉన్నది; చెప్పెదన్ = తెలియచెప్పెదను; నా = నా యొక్క; టెంకి = నివాసము; సుజనులు = మంచివారి, పుణ్యాత్ముల; అందున్ = లో, ఎడల; తఱచు = ఎక్కువగా, ఎక్కువమార్లు; చొచ్చి = కూడి, చొరవకలిగి; ఉందున్ = ఉంటాను.

భావము:

“ఇది నా చోటు అని ఎలా చెప్పగలను? ఒక చోటనకుండా అన్ని చోట్లా ఉంటాను. ఎవరికి చెందినవాడనని చెప్పగలను? నేను నాఅంతవాడనై స్వేచ్ఛగా నడుచుకుంటాను. నానడవడి ఇది అని ఎలా చెప్పగలను? పూనికతో మూడుపోకడలూ పొగలను. అది ఇది నేర్చుకున్నానని చెప్పడము ఎందుకు గానీ, అన్ని విద్యలూ నేర్చుకున్నాను. వేరే వారు ఎవ్వరూ నన్ను చేరదీయరు. నేనే వారిని చేరదీస్తాను. నేను ఒంటరివాణ్ణి. చుట్టాలు ఎవరూ లేరు. ఇంతకు ముందు నాకు సిరికూడా ఉండేది. ఎక్కువగా నేను మంచివారితో కలిసి మసలుతుంటాను. అదే నా నివాసము.