పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు యఙ్ఞవాటిక చేరుట

  •  
  •  
  •  

8-535-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ సమయంబున బలిసభామండపంబుఁ దఱియం జొచ్చి.

టీకా:

ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు; బలి = బలియొక్క; సభామండపంబున్ = సభాస్థలి; దఱియన్ = దగ్గరకు; చొచ్చి = చేరి.

భావము:

సభలో అలా కలకలం జరుగుతుండగా, ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభమంటపం దరిచేరాడు.