పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు యఙ్ఞవాటిక చేరుట

  •  
  •  
  •  

8-534-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుగుజలు పోవువారును
జిబిజిఁ బడువారు చాలఁ లకల పడుచున్
జిబిజి యైరి సభాస్థలిఁ
బ్ర లెల్లను బొట్టివడుగు పాపని రాకన్.

టీకా:

గుజగుజలు = గుసగుసలు; పోవువారును = ఆడువారును; గజిబిజిన్ = తికమక; పడువారు = పడువారును; చాలన్ = మిక్కిలి; కలకల = కలకలము; పడుచున్ = పడుచు; గజిబిజిన్ = తికమకపడినవారు; ఐరి = అయిరి; సభాస్థలిన్ = సభాప్రాంగణములోని; ప్రజలు = జనులు; ఎల్లన్ = అందరు; పొట్టి = వామనరూపు; వడుగు = బ్రహ్మచారి; పాపని = పిల్లవాని; రాకన్ = వచ్చుటతో.

భావము:

పొట్టి బ్రహ్మచారి యైన వామనుడు రాగానే ఆ సభలోని కొందరు ప్రజలు గుసగుసలాడారు. కొందరు గజిబిజి పడ్డారు. కొందరు తికమక పడ్డారు. అలా ఆ సభలోని వారందరూ పెద్ద కలకలం చేసారు.