పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని భిక్షాగమనము

  •  
  •  
  •  

8-529-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్మద, యమదండక్షత
ర్మద, నతి కఠిన ముక్తి నితాచేతో
ర్మద, నంబునివారిత
దుర్మద, నర్మదఁ దరించెఁ ద్రోవన్ వటుఁడున్.

టీకా:

శర్మద = శుభములనిచ్చునది; యమ = యముని; దండ = దండనము యొక్క; క్షత = దెబ్బలనుండి; వర్మదన్ = కాపాడు కవచము వంటిదానిని; అతి = మిక్కిలి; కఠిన = గట్టిదైన, గడుసుదైన; ముక్తి = ముక్తి యనెడి; వనిత = స్త్రీ యొక్క; చేతస్ = మనసు; మర్మదన్ = మర్మమును తెలిపెడిదానిని; అంబు = (తన) నీటితో; నివారిత = నివారించబడు; దుర్మదన్ = దోషములుగలదానిని; నర్మదన్ = నర్మదానదిని; తరించెన్ = దాటెను; త్రోవన్ = దారిలో; వటుడున్ = బ్రహ్మచారి.

భావము:

నర్మదానది శుభాలను అందించేది. యమ బాధలు అనే బాణాల నుండి కవచంలా కాపాడేది; బహు గడుసుది అయిన ముక్తికాంత మనసులోని గుట్టు బయట పెట్టేది; తన నీళ్ళతో దోషాలను నివారించేది. వామనుడు తన దారిలో అలాంటి మహిమాన్వితమైన నర్మదానదిని దాటాడు.