పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని విప్రుల సంభాషణ

  •  
  •  
  •  

8-521-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వత్తురె విప్రులు? వేఁడఁగ
నిత్తురె దాతలును వేడ్క నిష్టార్థములం?
దెత్తురె మీరును సంపద?
లిత్తెఱఁగున దాన వీరుఁ డెవ్వఁడొ చెపుడా.

టీకా:

వత్తురె = వస్తుంటార; విప్రులు = బ్రాహ్మణులు; వేడగన్ = యాచించుటకు; ఇత్తురె = ఇస్తుంటారా; దాతలును = దానములిచ్చువారు; వేడ్కన్ = సంతోషముతో; ఇష్ట = కోరిన; అర్థములన్ = కోరికలను; తెత్తురె = తెచ్చుకొన్నారా; మీరును = మీరుకూడ; సంపదలున్ = సంపదలను; ఈ = ఈ; తెఱంగునన్ = విధమైన; దాన = దానముచేసే; వీరుడు = శూరుడు; ఎవ్వడొ = ఎవరో; చెపుడా = చెప్పండి.

భావము:

“దానాలు అందుకోవడానికి బ్రాహ్మణులు దాతల చెంతకు వెళ్తున్నారా? వారు కోరిన ధనాలను దాతలు ఇస్తున్నారా? మీరుకూడా అలా ధనాన్ని తెచ్చుకుంటారా? ఈవిధంగా అర్థులకు అడిగినది ఇచ్చే మహా దాత ఎవరో చెప్పండి.”