పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామను డవతరించుట

  •  
  •  
  •  

8-519-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శుద్ధబ్రహ్మర్షి సమా
రాద్ధుండై విహితమంత్రరాజిఁ జదువుచుం
బ్రోద్ధంబగు ననలంబున
వృద్ధాచారమున వటుఁడు వేల్చెన్ గడకన్!

టీకా:

శుద్ధ = పరిశుద్ధమైన; బ్రహ్మర్షి = మునీశ్వరులుచే; సమారాద్ధుండు = చక్కగా సిద్ధము చేయబడినవాడు; ఐ = అయ్యి; విహిత = శాస్త్రానుసారము; మంత్రరాజిన్ = వేదమంత్రములను; చదువుచున్ = చదువుతూ; ప్రోద్ధంబు = వెలుగుతున్నది; అగు = అయిన; అనలంబునన్ = అగ్నియందు; వృద్ధాచారమునన్ = సంప్రదాయబద్ధముగా; వటుడు = బ్రహ్మచారి; వ్రేల్చెను = హోమముచేసెను; కడకన్ = నిష్ఠతో.

భావము:

ఆ పరిశుద్ధులైన బ్రహ్మఋషులు వామనుని ఆదరంగా హోమానికి సిద్ధంచేసారు. తరువాత, ఆ బ్రహ్మచారి సంప్రదాయం ప్రకారం వేదమంత్రాలు చదువుతూ, వెలిగే అగ్నిహోత్రంలో ఉత్సాహంతో హోమం చేసాడు.