పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామను డవతరించుట

  •  
  •  
  •  

8-515-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నా! ర" మ్మని డగ్గఱి
న్నుల పాలేఱువాఱ సంశ్లేషిణి యై
చిన్నారి మొగము నివురుచుఁ
న్నారం జూచెఁ గన్నడుపై యుంటన్.


8-515/1-వ.
అంత.
- తంజనగరము తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి

టీకా:

అన్నా = అబ్బాయి; రమ్ము = రా; అని = అని; డగ్గఱి = దగ్గరకుతీసుకొని; చన్నులన్ = స్తనములందు; పాలు = పాలు; ఏఱువాఱ = జాలువారగా; సంశ్లేషిణి = కౌగలించుకొన్నది; ఐ = అయ్యి; చిన్నారి = బుల్లి; మొగమున్ = ముఖమును; నివురుచున్ = దువ్వుచు; కన్నారన్ = కంటినిండుగా; చూచెన్ = చూసెను; కన్నకడుపు = తన కడుపున పుట్టినవాడు; ఐ = అయ్యి; ఉంటన్ = ఉండుటచేత.

భావము:

నా కన్నా! రావయ్యా” అంటూ అదితి దగ్గరకు పిలిచింది, అక్కున చేర్చుకుంది, మొహాన్ని దువ్వింది. తను కడుపారా కన్న ఆ చిన్నారి బాలుని కన్నుల నిండుగా చూచింది.