పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామను డవతరించుట

  •  
  •  
  •  

8-514-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

8-514-ఆ.
"న్నుఁ గన్న తండ్రి! నా పాలి దైవమ!
నా తపఃఫలంబ! నా కుమార!
నాదు చిన్ని వడుగ! నా కులదీపిక!
రాఁగదయ్య; భాగ్య రాశి వగుచు

టీకా:

నన్నున్ = నన్ను; కన్నతండ్రి = కన్నతండ్రి; నా = నా; పాలి = పాలిటి; దైవమా = దేవుడా; నా = నా యొక్క; తపః = తపస్సుయొక్క; ఫలంబ = ఫలితముగ కలిగినవాడ; నా = నా యొక్క; కుమార = పుత్రుడ; నాదు = నా యొక్క; చిన్ని = చిన్న; వడుగ = బాలుడ; నా = నా యొక్క; కుల = వంశమును; దీపిక = ప్రకాశింపజేయువాడ; రాగదు = రమ్ము; అయ్య = తండ్రి; భాగ్యరాశివి = పెన్నిధివి; అగుచున్ = అగుచు.

భావము:

కన్నబిడ్డ యైన వామనుని “నా కన్నతండ్రీ! నా పాలి దేవుడా! నా నోములపంటా! నా ముద్దుల కన్నా! నాచిన్నవడుగా! నా వంశాలంకారమా! నా పెన్నిధీ! . రావయ్యా.