పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామను డవతరించుట

  •  
  •  
  •  

8-509-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిక్కులకావిరి వాసెను
నెక్కువ నిర్మలత నొందె నేఁడు పయోధుల్
నిక్కమెయి నిలిచె ధరణియుఁ
జుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై.

టీకా:

దిక్కుల = దిక్కులందలి; కావిరి = నలుపు, మాపు; పాసెను = పోయెను; ఎక్కువ = చాలా; నిర్మలతన్ = నిర్మలముగ నుండుటను; ఒందె = పొందినవి; ఏడు = ఏడు; పయోధుల్ = సముద్రములు; నిక్కమెయి = ధృడమా; నిలిచె = అలరారెను; ధరణియున్ = భూమండలము; చుక్కలత్రోవయును = ఆకాశము {చుక్కలత్రోవ - చుక్కలు (నక్షత్రములు) త్రోవ (తిరుగు స్థలము), ఆకాశము}; విప్ర = బ్రాహ్మణలు; సుర = దేవతలు చేత; సేవ్యములు = కొలువబడినవి; ఐ = అయ్యి.

భావము:

వామనుడు అవతరించడంతో, బ్రాహ్మణులతో దేవతలతో సేవింపడుతూ, సకల దిక్కులు అందలి కావిరిరంగు కరగిపోయింది; సప్తసముద్రాలు నిర్మలం అయ్యాయి; భూమి, ఆకాశం ధృడంగా అలరారెను.