పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు గర్భస్తు డగుట

  •  
  •  
  •  

8-496-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కడుపున నొక యిరువునఁ
రుహగర్భాండభాండ నధిచయంబుల్
గొకొని జగములు నిడుకొని
నుగతిఁ గడు నడఁగి మడిఁగి నరెన్ బెడఁగై.

టీకా:

తన = తన యొక్క; కడుపునన్ = గర్భమునందు; ఒక = ఒక; ఇరువున = పక్కన; వనరుహగర్భాండభాండ = బ్రహ్మాండముల {వనరుహగర్భాండభాండము - వనరుహగర్భ (బ్రహ్మ) అండముల భాండములు (గుంపులు), బ్రహ్మాండభాండములు}; వనధి = సముద్రముల {వనధి - వనము (నీటి)కి నిధి, సముద్రము}; చయంబుల్ = సమూహములు; కొనకొని = కూడుకొనిన; జగములున్ = భువనములను; ఇడుకొని = ఉంచుకొని; తను = సన్ననిఅర్భకుని; గతిన్ = వలె; అడగి = అణిగి; మడిగి = మణిగి; తనరెన్ = చక్కగనుండెను; బెడగు = అందగించినవాడు; ఐ = అయ్యి.

భావము:

అదితి గర్భంలోని చిన్నారి శిశువు భూగోళాలనూ ఖగోళాలను సముద్రాలను సమస్తలోకాలనూ తన కడుపులో ఇమిడించికొని సన్ననైన చిన్ని రూపంతో అందంగా అణగిమణిగి ఉన్నాడు.