పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు గర్భస్తు డగుట

  •  
  •  
  •  

8-490-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు భక్తజనపరతంత్రుండగు పురాణపురుషుం డానతిచ్చి తిరోహితుడయ్యె; అ య్యదితియుఁ గృతకృత్య యై సంతోషంబునఁ దన మనోవల్లభుండగు కశ్యపు నాశ్రయించి సేవించుచుండె; నంత నొక్క దివసంబున.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; భక్త = భక్తులైన; జన = వారికి; పరతంత్రుడు = లొంగిపోవువాడు; అగు = అయినట్టి; పురాణపురుషుండు = హరి; ఆనతిచ్చి = చెప్పి; తిరోహితుండు = మాయమైనవాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; అదితియున్ = అదితి; కృతకృత్య = కృతార్థురాలు; ఐ = అయ్యి; సంతోషంబునన్ = సంతోషముతో; తన = తన యొక్క; మనోవల్లభుండు = భర్త; అగు = అయిన; కశ్యపున్ = కశ్యపుని; ఆశ్రయించి = చేరి; సేవించుచుండెన్ = కొలుచుచుండెను; అంతన్ = అంతట; ఒక్క = ఒక; దివసంబున = దినము.

భావము:

ఆ విధంగా భక్తజన విధేయుడైన విష్ణుమూర్తి సెలవిచ్చి మాయమయ్యాడు. కృతార్థురాలైన అదితి సంతోషంతో తన ప్రాణవల్లభుడైన కశ్యపప్రజాపతిని చేరి సేవించసాగింది. అటు పిమ్మట ఒకనాడు, . . .