పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : దితి కశ్యపుల సంభాషణ

  •  
  •  
  •  

8-474-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన మనోవల్లభ పలుకు లాకర్ణించి ముహూర్తమాత్రంబు చింతించి విజ్ఞానదృష్టి నవలంబించి భావికాల కార్యంబు విచారించి కశ్యప బ్రహ్మ యిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; మనోవల్లభ = భార్య {మనోవల్లభ - మనసునకు వల్లభ (నాయిక), సతి}; పలుకుల్ = మాటలు; ఆకర్ణించి = విని; ముహూర్తమాత్రంబు = కొద్దిసేపు; చింతించి = ఆలోచించి; విజ్ఞానదృష్టిన్ = దివ్యదృష్టిని; అవలంభించి = సారించి; భావి = రాబోవు; కాల = కాలము; కార్యంబున్ = సంగతులు; విచారించి = ఆలోచించి; కశ్యప = కశ్యపుడు యనెడి; బ్రహ్మ = ప్రజాపతి; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను.

భావము:

ఇలా అంటున్న తన ప్రియ భార్య మాటలు విని, కశ్యపప్రజాపతి కొంచెంసేపు ఆలోచించాడు. జ్ఞానదృష్టితో రాబోయే కాలంలో జరగబోయే సంగతులు తెలుసుకుని ఇలా అన్నాడు.