పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : దితి కశ్యపుల సంభాషణ

  •  
  •  
  •  

8-470-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్కా చెల్లెండ్రయ్యును
క్కరు నాతోడి పోరుఁ; దానున్ దితియున్
క్కసులు సురల మొత్తఁగ
క్కట! వల దనదు చూచు నౌనౌ ననుచున్.

టీకా:

అక్కచెల్లెండ్రు = అక్కాచెల్లెళ్ళము; అయ్యున్ = అయినప్పటికిని; తక్కరు = వదలిపెట్టరు; నా = నా; తోడి = తోటి; పోరున్ = దెబ్బలాటలను; తానున్ = ఆమె; దితియున్ = దితికూడ; రక్కసులు = రాక్షుసులు; సురలన్ = దేవతలను; మొత్తగన్ = కొడుతుండగ; అక్కట = అయ్యో; వలదు = వద్దు; అనదు = అని చెప్పదు; చూచున్ = చూచుచుండును; ఔనౌను = భళీభళీ; అనుచున్ = అనుచు.

భావము:

దితీ నేనూ అక్కాచెల్లెళ్ళమే. అయినప్పటికీ ఆమె నాతో ఎప్పుడూ కలహిస్తూనే ఉంటుంది. దేవతలను ఆమె పిల్లలు రాక్షసులు బాధపెడుతున్నా ఆమె మెచ్చుకుంటుందే కాని వద్దని అనదు.