పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : దితి కశ్యపుల సంభాషణ

  •  
  •  
  •  

8-469-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ప్రే యొకింత లేక దితి బిడ్డలు బిడ్డలబిడ్డలున్ మహా
భీ బలాఢ్యులై తనదుబిడ్డల నందఱఁ దోలి సాహసా
క్రామిత వైరులయ్యు నమరావతి నేలుచు నున్నవారు; నీ
కే ని విన్నవింతు? హృదయేశ్వర! మేలుఁ దలంచి చూడవే?

టీకా:

ప్రేమ = ప్రేమాభిమానములు; ఒకింత = ఏ మాత్రమూ, కొంచెము కూడ; లేక = లేకుండగ; దితి = దితి యొక్క; బిడ్డలు = పిల్లలు; బిడ్డలబిడ్డలు = మనుమలు; మహా = అధికమైన; భీమ = భీకరమైన; బలాఢ్యులు = శక్తిమంతులు; ఐ = అయ్యి; తనదు = నా; బిడ్డలన్ = పిల్లలను; అందఱన్ = అందరిని; తోలి = పారదోలి; సాహస = సాహసముతో; ఆక్రమిత = ఆక్రమించిన; వైరులు = శత్రువులు; అయ్యున్ = అయ్యి; అమరావతిన్ = దేవతల రాజధానిని; ఏలుచున్నావారు = పరిపాలించుచున్నారు; నీ = నీ; కున్ = కు; ఏమి = ఏమిటి; అని = అని; విన్నవింతున్ = చెప్పుకోగలను; హృదయేశ్వర = భర్తా; మేలు = ఏది మంచిదో; తలచి = ఆలోచించి; చూడవే = చూడుము.

భావము:

“ఓ నా హృదయానికి ప్రభువు అయిన పతీ! దితి బిడ్డలూ వారి బిడ్డలూ బలవంతులై నా బిడ్డలపై సవితి సోదరులు అన్న ప్రేమ ఏమాత్రం చూపకుండా, పగబూని ఓడించి, పారద్రోలారు. సాహసంతో అమరావతిని ఆక్రమించుకొని పాలిస్తున్నారు. ఈ విషాదవార్త నీకు ఏమని చెప్పమన్నావు. నా పిల్లలకు మేలు కలిగే మార్గం ఏదో ఆలోచించి చూడు.