పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : దితి కశ్యపుల సంభాషణ

  •  
  •  
  •  

8-467-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బిడ్డలు వెఱతురె నీకఱ
గొడ్డంబులు జేయ కెల్ల కోడండ్రును మా
ఱొడ్డారింపక నడతురె
యెడ్డము గాకున్నదే మృగేక్షణ! యింటన్."

టీకా:

బిడ్డలు = పిల్లలు; వెఱతురె = భయభక్తులతో నున్నారా; నీ = నీ; కున్ = కు; అఱగొడ్డంబులు = తిరగబడుట; చేయక = చేయకుండగ; ఎల్ల = అందరు; కోడండ్రును = కోడళ్ళు; మాఱొడ్డారింపక = ప్రతిఘటించకుండగ; నడతురె = వర్తించుతున్నారా; ఎడ్డము = ఇబ్బంది; కాక = లేకుండగ; ఉన్నదె = ఉన్నాదా; మృగేక్షణ = సుందరీ {మృగేక్షణ - మృగ (లేడివంటి) ఈక్షణ (చూపులు గలామె), స్త్రీ}; ఇంటన్ = ఇంటిలో.

భావము:

లేడికన్నులతో అందంగా ఉండే అదితీ! నీ విషయంలో నీ కొడుకులు వినయంగా ఉంటున్నారా? కోడళ్ళు నీకు ఎదురు చెప్పకుండా ఉంటున్నారా? ఇంట్లో ఇబ్బందులు ఏమి లేవు కదా!”.