పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : దుర్భర దానవ ప్రతాపము

 •  
 •  
 •  

8-452-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లి వచ్చి విడియుట లభేది వీక్షించి-
ట్టిగాఁ గోటకుఁ గాపు పెట్టి
దేవవీరులుఁ దాను దేవతామంత్రిని-
ప్పించి సురవైరి రాకఁ జెప్పి
"ప్రళయానలుని భంగి భాసిల్లుచున్నాఁడు-
ఘోరరాక్షసులను గూడినాఁడు
న కోడి చని నేఁడు రల వీఁ డేతెంచె-
నే తపంబున వీని కింత వచ్చె?

8-452.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీ దురాత్ముకునకు నెవ్వఁడు దోడయ్యె?
నింక వీని గెల్వ నేది త్రోవ?
యేమి చేయువార? మెక్కడి మగఁటిమి?
నెదురు మోహరింప నెవ్వఁ డోపు?

టీకా:

బలి = బలి; వచ్చి = వచ్చి; విడియుటన్ = ఉన్నవిషయము; బలభేది = ఇంద్రుడు; వీక్షించి = చూసి; గట్టిగా = బలమైనవిధముగ; కోట = కోట; కున్ = కు; కాపు = కాపలా; పెట్టి = ఏర్పాటుచేసి; దేవ = దేవతా; వీరులున్ = సేనానాయకులును; తాను = అతను; దేవతామంత్రిని = బృహస్పతిని; రప్పించి = పిలిపించి; సురవైరి = రాక్షసుడు; రాకన్ = వచ్చుటను; చెప్పి = తెలియజేసి; ప్రళయ = ప్రళయకాలపు; అనలుని = అగ్ని; భంగిన్ = వలె; భాసిల్లుచున్నాడు = మండిపడుతున్నాడు; ఘోర = భీకరమైన; రాక్షసులను = రాక్షసులను; కూడినాడు = కూడి ఉన్నాడు; మన = మన; కున్ = కు; ఓడి = ఓడిపోయినవాడై; చని = వెళ్ళి; నేడు = ఇవాళ; మరలన్ = మళ్ళీ; వీడు = ఇతడు; ఏతెంచెన్ = వచ్చెను; ఏ = ఎట్టి; తపంబునన్ = తపస్సువలన; వీని = ఇతని; కిన్ = కి; ఇంత = ఇంతధైర్యము; వచ్చెన్ = వచ్చినదో; ఈ = ఈ.
దురాత్మున్ = దుష్టుని; కున్ = కి; ఎవ్వడు = ఎవరు; తోడు = సహాయముచేయువాడు; అయ్యెన్ = అయినాడో; ఇంక = ఇక; వీనిన్ = ఇతనిని; గెల్వన్ = జయించుటకు; ఏది = ఏమిటి; త్రోవ = దారి; ఏమి = ఏమిటి; చేయువారము = చేయగలము; ఎక్కడి = ఎక్కడిదింత; మగటిమి = పరాక్రమము; ఎదురన్ = ఎదురుగా; మోహరింపన్ = సేనలను నిలుపుటను; ఎవ్వడు = ఎవరు; ఓపు = చేయగలరు.

భావము:

బలిచక్రవర్తి వచ్చి పట్టణాన్ని ముట్టడించడం దేవేంద్రుడు తెలుసుకున్నాడు. కోటకు బలమైన కాపలా ఏర్పాటు చేసాడు. దేవతావీరులతో కలిసి దేవమంత్రి అయిన బృహస్పతిని పిలిపించాడు. బలిచక్రవర్తి దండెత్తి వచ్చిన సంగతి ఇలా చెప్పసాగాడు “వాడు ప్రళయాగ్ని వలె మండిపడుతున్నాడు. క్రూరులైన రాక్షసులతో కూడి ఉన్నాడు. మనతో ఓడిపోయి ఈనాడు తిరిగి మనపైకి వచ్చాడు. ఏ తపస్సువలస వాని కింత శక్తి వచ్చిందో? ఈ దురాత్ముడు ఎవరి సహాయాన్ని పొందినాడో? వీనిని గెలిచే మార్గమేది? ఏం చేయాలి? పరాక్రమంతో వీడిని రణరంగంలో ఎదిరించి నిలువగల వీరుడు ఎవడు. . .