పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : దుర్భర దానవ ప్రతాపము

  •  
  •  
  •  

8-450-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుర్భర దానవ శంఖా
విర్భూతధ్వనులు నిండి విబుధేంద్రవధూ
ర్భములు పగిలి లోపలి
ర్భకతతు లావు రనుచు నాక్రోశించెన్.

టీకా:

దుర్భర = భరింపశక్యముకాని; దానవ = రాక్షసుని; శంఖా = శంఖమునుండి; ఆవిర్భూత = వెలువడిన; ధ్వనులు = శబ్దములు; నిండి = పూరింపబడి; విబుధ = దేవతలైన; ఇంద్ర = శ్రేష్ఠుల; వధూ = స్త్రీల; గర్భములు = గర్భములు; పగిలి = బ్రద్ధలై; లోపలి = లోపల ఉన్న; అర్భక = శిశువుల; తతులు = సమూహములు; ఆవురు = ఆ; అనుచున్ = అనుచు; ఆక్రోశించెన్ = దుఃఖించెను.

భావము:

అమరావతి పట్టణాన్ని రాక్షసులు ముట్టడించి విజయశంఖాలు పూరించారు. వారి శంఖారావాలకు దేవతా స్త్రీల గర్భాలు బ్రద్దలైపోయాయి. ఆ గర్భాలలోని శిశువులు ఆక్రోశించారు.