పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : స్వర్గ వర్ణనము

  •  
  •  
  •  

8-445-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు బలవంతుఁడగు బలి సురేంద్రుని సాధింప సమకట్టి దండ గమనంబులు జేసి, నిడుద పయనంబులం జనిచని.

టీకా:

ఇట్లు = ఇలా; బలవంతుడు = బలశాలి; అగు = అయిన; బలి = బలి; సురేంద్రుని = దేవేంద్రుని; సాధింప = పగదీర్చుకొనుటకు; సమకట్టి = పూనుకొని; దండగమనంబులు = దండయాత్రలు; చేసి = చేసి; నిడుద = దీర్ఘమైన; పయనంబులన్ = ప్రయాణములు; చనిచని = సాగించి.

భావము:

బలశాలి అయిన బలిచక్రవర్తి ఇలా దేవేంద్రునిపై పగ తీర్చుకోవాలని సంకల్పించుకుని, వేగంగా దీర్ఘమైన ప్రయాణాలు సాగించి సాగించి...