పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలి యుద్ధ యాత్ర

  •  
  •  
  •  

8-441-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాణియు, రథియుఁ, గృపాణియుఁ,
దూణియు, ధన్వియును, స్రగ్వి తురగియు, దేహ
త్రాణియు, ధిక్కృత విమత
ప్రాణియు, మణి కనక వలయ పాణియు నగుచున్.

టీకా:

పాణియున్ = బాణములుచేతగలవాడు; రథియున్ = రథమెక్కినవాడు; కృపాణియున్ = కత్తిధరించినవాడు; తూణియున్ = అమ్ములపొదిగలవాడు; ధన్వియును = విల్లుధరించినవాడు; స్రగ్వి = పూలదండగలవాడు; తురగియున్ = గుఱ్ఱముగలవాడు; దేహత్రాణియున్ = కవచధారి; ధికృత = తిరస్కరింపబడిన; విమత = శత్రువుల; ప్రాణియున్ = ప్రాణములుగలవాడు; మణి = రత్నాల; కనక = బంగారపు; వలయ = కంకణములుగల; పాణియున్ = చేతధరించినవాడు; అగుచున్ = అగుచు.

భావము:

బలిచక్రవర్తి బాణాలూ, రథమూ, ఖడ్గమూ, అమ్ములపొదులూ, విల్లు, పూలదండ, గుఱ్ఱాలు, కవచమూ, రత్నఖచిత సువర్ణకంకణాలు సంపాదించాడు. అటుపిమ్మట పగవారిపై పగతీర్చుకొవాలి అని నిశ్చయించుకున్నాడు.