పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 14ఇంద్రసావర్ణిమనువు చరిత్ర

  •  
  •  
  •  

8-434-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుం బ్రాప్తులయిన వారల నింద్రపదంబులను, బహుప్రకారంబుల దేవపదంబులను, హరి ప్రతిష్ఠించుచుండు; వారలు విహిత కర్మంబుల జగత్త్రయంబునుం బరిపాలింతురు; లోకంబులు సువృష్టులై యుండు.

టీకా:

మఱియున్ = ఇంకను; ప్రాప్తులు = ప్రాప్తముగలవారు; అయిన = ఐన; ఇంద్ర = ఇంద్ర; పదంబు = పదవి; లోన్ = అందు; బహు = అనేక; ప్రకారంబులన్ = విధములుగ; దేవ = దివ్యమైన; పదంబులనున్ = పదవులలో; హరి = నారాయణుడు; ప్రతిష్ఠించుచుండున్ = నియమించుచుండును; వారలున్ = వారు; విహిత = నిర్ణయింపబడిన; కర్మంబులన్ = కార్యములతో; జగత్రయంబునున్ = ముల్లోకములను; పరిపాలింతురు = పరిపాలించెదరు; లోకంబులు = లోకములు; సువృష్ఠులు = సుభిక్షములు; ఐ = అయ్యి; ఉండు = ఉండును.

భావము:

విష్ణువు శక్తిమంతులను ఇంద్ర పదవిలోనూ, పెక్కు విధాలైన దేవతల పదవులలోనూ నెలకొల్పుతాడు. వారు తమకు నిర్ణయింపబడిన నియమాలతో మూడులోకాలనూ ఏలుతారు. లోకాలు సుభిక్షంగా ఉంటాయి.