పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 14ఇంద్రసావర్ణిమనువు చరిత్ర

  •  
  •  
  •  

8-427-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నట వచ్చు కాలంబున నింద్రసావర్ణి పదునాలవ మను వయ్యెడి; మను నందనులు గభీరవస్వాదులు రాజులును; బవిత్ర చాక్షుషు లనువారు దేవగణంబులును; శుచి యనువాఁ డింద్రుండును; నగ్ని బాహు శుచి శుక్ర మాగధాదులు ఋషులును నయ్యెదరు; అందు.

టీకా:

మఱియున్ = ఇంకను; అటవచ్చు = ఆతరువాతరాబోవు; కాలంబునన్ = కాలమునందు; ఇంద్రసావర్ణి = ఇంద్రసావర్ణి; పదునాలవ = పద్నాలుగవ (14); మనువు = మనువు; అయ్యెడిన్ = అవుతాడు; మను = మనువు యొక్క; నందనులు = పుత్రులు; గభీర = గంభీరుడు; వసువు = వసువు; ఆదులున్ = మున్నగువారు; రాజులును = రాజులు; పవిత్ర = పవిత్రులు; చాక్షష = చాక్షషులు; అనువారు = అనెడివారు; దేవ = దేవతా; గణంబులును = గణములును; శుచి = శుచి; అనువాడు = అనెడివాడు; ఇంద్రుండునున్ = ఇంద్రుడు; అగ్నిబాహు = అగ్నిబాహుడు; శుచి = శుచి; శుక్ర = శుక్రుడు; మాగధ = మాగధుడు; ఆదులున్ = మున్నగువారు; ఋషులునున్ = ఋషులు; అయ్యెదరు = అవుతారు; అందున్ = ఆ కాలమునందు.

భావము:

ఆ తరువాత రాబోయేకాలంలో ఇంద్రసావర్ణి పద్నాల్గవ మనువు అవుతాడు. అతని కొడుకులైన గంభీరుడూ, వసువూ మొదలైనవారు రాజులు అవుతారు. పవిత్రులూ, చాక్షుషులూ దేవతలు అవుతారు. శుచి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. అగ్ని బాహువూ శుచీ, శుక్రుడూ, మాగధుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు.