పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 4తామసమనువు చరిత్ర

 •  
 •  
 •  

8-17-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చతుర్థమనువు కాల ప్రసంగంబు వివరించెద.

టీకా:

చతుర్థ = నాలుగవ (4); మనువు = మనువు; కాల = కాలము గురించిన; ప్రసంగంబు = సంగతి; వివరించెద = వివరముగ తెలిపెద.

భావము:

శుకమహర్షి చెప్తున్నారు “నాలుగో మనువు కాలం గురించి వివరిస్తాను పరీక్షిన్మహారాజా!
రహస్యార్థం: మనవులు 14 మంది. ఒక్కొక్క మనువు పరిపాలించే కాలాన్ని మన్వంతరం అంటారు. ఒక మన్వంతంరం అంటే 71 మహాయుగాలు. వాటిలో ప్రస్తుతం జరుగుతున్నది వైవస్వత మన్వంతరం. గజేంద్రమోక్షం జరిగిన కాలం తామస మన్వంతరం. 14గురు మనువులలో ఈ తామసుడు 4వ వాడు. వైవస్వతుడు 7వ వాడు. కృత ద్వాపర త్రేత కలి యుగాలకి యుగధర్మం ఎలా ఉంటుందో, అలాగే స్వాయంభువాది 14 మన్వంతరాలకు ఆయా ధర్మాలు ఉంటాయేమో. మరి ప్రభవాది 60 సంవత్సరాలకు కూడ సంవత్సర ధర్మాలు ఉంటాయేమో.

8-18-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మానవాధీశ్వర! నువు నాలవవాఁడు;
తామసుం డనఁగ నుత్తముని భ్రాత;
పృథ్వీపతులు కేతు వృష నర ఖ్యాత్యాదు;
తని పుత్రులు పద్గు ధిక బలులు;
త్యకహరి వీర సంజ్ఞలు వేల్పులు;
త్రిశిఖనామమువాఁడు దేవవిభుఁడు;
మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు; హరి పుట్టె;
రిమేధునకుఁ బ్రీతి రిణియందు;

8-18.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గ్రాహబద్ధుఁ డయిన జరాజు విడిపించి
ప్రాణభయము వలనఁ బాపి కాచె;
రి దయాసముద్రుఁ ఖిలలోకేశ్వరుఁ
నిన శుకునిఁ జూచి వనివిభుఁడు.

టీకా:

మానవాధీశ్వర = రాజా {మానవాధీశ్వరుడు - మానవులకు అధీశ్వరుడు (ప్రభువు), రాజు}; మనువు = మనువు; నాలవ = నాలుగవ (4); వాడు = వాడు; తామసుండు = తామసుడు; అనగన్ = అనెడి; ఉత్తముని = ఉత్తముని; భ్రాత = సోదరుడు; పృథ్వీపతులు = రాజులు {పృథ్వీపతి - పృథ్వి (భూమి)కి పతి (ప్రభువు), రాజు}; కేతు = కేతుడు; వృష = వృషుడు; నర = నరుడు; ఖ్యాతి = ఖ్యాతి; ఆదులు = మొదలగువారు; అతని = అతని యొక్క; పుత్రులు = కుమారులు; పద్గురు = పదిమంది (10); అధిక = మిక్కిలి; బలులు = బలశాలులు; సత్యక = సత్యకులు; హరి = హరులు; వీర = వీరులు; సంజ్ఞులు = అనెడి పేర్లుగలవారు; వేల్పులు = దేవతలు; త్రిశిఖ = త్రిశిఖుడు యనెడి; నామమువాడు = పేరుగలవాడు; దేవవిభుడు = ఇంద్రుడు; మునులు = సప్తర్షులు; జ్యోతిర్వ్యోమ = జ్యోతిర్వ్యోముడు; ముఖ్యులు = మున్నగువారు; హరి = నారాయణుడు; పుట్టె = అవతరించెను; హరిమేధున్ = హరిమేధుని; కున్ = కి; ప్రీతిన్ = కోరి; హరిణి = హరిణి; అందున్ = అందు.
గ్రాహ = మొసలిచేత; బద్దుడు = చిక్కినవాడు; అయిన = ఐన; గజరాజు = ఏనుగులలో నాయకుడు; విడిపించి = విడిపించి; ప్రాణభయము = ప్రాణాపాయము; వలన = నుండి; పాపి = దూరముచేసి; కాచెన్ = కాపాడెను; హరి = విష్ణుమూర్తి {హరి - హరిణి హరిమేధుల పుత్రుడు, విష్ణువు}; దయాసముద్రుడు = విష్ణుమూర్తి {దయాసముద్రుడు - కృప యనెడి సముద్రుగల వాడు, విష్ణువు}; అఖిలలోకేశ్వరుడు = విష్ణుమూర్తి {అఖిలలోకేశ్వరుడు - అఖిల (సమస్తమైన) లోక (లోకములకు) ఈశ్వరుడు, విష్ణువు}; అనినన్ = అనగా; శుకునిన్ = శుకుని; చూచి = చూసి; అవనివిభుడు = రాజు {అవనివిభుడు - అవని (భూమి)కి ప్రభువు, రాజు}.

భావము:

ఓ మహారాజా! నాలుగో మనువు ‘తామసుడు’. ఇతడు ఉత్తముడి తమ్ముడు. అతని కొడుకులు కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన వారు పదిమంది. వారు బలవంతులైన రాజులు. ఆ మన్వంతరంలో సత్యకులు, హరులు, వీరులు మొదలైనవారు దేవతలు. త్రిశిఖుడు అనేవాడు దేవేంద్రుడు. జ్యోతిర్వ్యోముడు మొదలైన వారు సప్తఋషులు. విష్ణుమూర్తి హరిమేధునకు పురంధ్రి అయిన హరిణికి ‘హరి’ అనే పేరుతో అవతరించాడు. దయాసముద్రుడు అఖిలలోకేశ్వరుడు మొసలినోటికి చిక్కిన గజేంద్రుడిని ప్రాణాపాయం తొలగించి రక్షించాడు అయిన వాడు ఆ శ్రీహరి.” ఇలా చెప్పగా పరీక్షిన్మహారాజు శుకయోగిని ఇలా అడిగాడు.
రహస్యార్థం: క్షరములకు అక్షరములకు అతీతమైనవాడు పరమాత్ముని ఉత్తమ పురుషుడు అని అంటారు. అతని సోదరుడు అంటే మాయా ప్రతిబింబుడు అయిన ఈశ్వరుడు. అతని వంశంలో ముఖ్యమైన వాడు అయి హరి, వాసుదేవ వ్యూహాత్మకుడు అయిన శ్రీమహావిష్ణువు. అట్టి విష్ణువు గజేంద్రుడు అనే జీవుడిని కామం అనే మొసలి వలన అయ్యే రాగహేతుకం అయిన జన్మ పరంపరల నుండి విముక్తుడిని చేసి రక్షించాడు. అని చక్కని పలుకులు పలికే శుకుడు చెప్పగా, భూలోకంలో ముఖ్యుడు అయిన పరీక్షిత్తు ఇలా అన్నాడు