పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 11ధర్మసావర్ణిమనువు చరిత్ర

  •  
  •  
  •  

8-422-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంబుజాత నేత్రుఁడా సూర్య సూనుఁడై
ర్మసేతు వనఁగఁ గ జనించి
వైభవాఢ్యుఁ డగుచు వైధృతుఁ డలరంగఁ
రుణఁ ద్రిజగములనుఁ గావఁ గలఁడు.

టీకా:

అంబుజనేత్రుడు = విష్ణువు; ఆ = ఆ; సూర్య = సూర్యుని యొక్క; సూనుడు = పుత్రుడుగా; ఐ = అయ్యి; ధర్మసేతువు = ధర్మసేతువు; అనగన్ = అనిపిలవబడి; తగన్ = తప్పక; జనించి = అవతరించి; వైభవ = మహిమలతో; ఆఢ్యుడు = సంపన్నుడు; అగుచున్ = అగుచు; వైధృతుడు = వైధృతుడు; అలరంగన్ = సంతోషించేటట్లు; కరుణన్ = కృపతో; త్రిజగములనున్ = ముల్లోకములను; కావగలడు = కాపాడబోవుచున్నాడు;

భావము:

ఆకాలంలో విష్ణువు ధర్మసేతువు అనే పేరుతో సూర్యుని కొడుకుగా జన్మిస్తాడు. అతడు మహిమలతో సంపన్నుడై వైధృతుడు సంతోషించేటట్లు మూడు లోకాలనూ కరుణతో కాపాడుతాడు.